Share News

Ticket Scam : నకిలీ బ్రిగేడియర్‌ ఐడీకార్డుతో శ్రీవారి వీఐపీ బ్రేక్‌ టికెట్లు!

ABN , Publish Date - Dec 17 , 2024 | 04:48 AM

రిటైర్డ్‌ లెఫ్టినెంట్‌ కల్నల్‌ ఫొటోతో బ్రిగేడియర్‌ అధికారిగా నకిలీ గుర్తింపు కార్డును సృష్టించి ఆరు వీఐపీ బ్రేక్‌ దర్శనం టికెట్లు పొందాడు ఓ ఆర్మీ క్యాంటీన్‌ ఉద్యోగి.

Ticket Scam : నకిలీ బ్రిగేడియర్‌ ఐడీకార్డుతో శ్రీవారి వీఐపీ బ్రేక్‌ టికెట్లు!

తిరుమల, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): రిటైర్డ్‌ లెఫ్టినెంట్‌ కల్నల్‌ ఫొటోతో బ్రిగేడియర్‌ అధికారిగా నకిలీ గుర్తింపు కార్డును సృష్టించి ఆరు వీఐపీ బ్రేక్‌ దర్శనం టికెట్లు పొందాడు ఓ ఆర్మీ క్యాంటీన్‌ ఉద్యోగి. వాటిని రూ.40 వేలకు ఆ లెఫ్టినెంట్‌ కల్నల్‌కే విక్రయించగా గుట్టు రట్టయ్యింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. విశ్వేశ్వర ప్రసాద్‌ రిటైర్డ్‌ లెఫ్టినెంట్‌ కల్నల్‌. శ్రీవారి దర్శనం కోసం చెన్నై ఆర్టీ క్యాంటీన్‌కు మెటీరియల్‌ సరఫరా చేసే సతీశ్‌ను, ఆయన ద్వారా తిరుపతిలోని ఆర్మీ క్యాంటీన్‌ ఉద్యోగి బ్రహ్మయ్యను సంప్రదించి నలుగురికి వీఐపీ బ్రేక్‌ దర్శనం కావాలని కోరారు. బ్రహ్మయ్య రూ.10 వేల చొప్పున నాలుగు టికెట్లకు రూ.40 వేలు వసూలు చేశాడు. విశ్వేశ్వరప్రసాద్‌ ఆధార్‌లోని ఫొటోతో నకిలీ బ్రిగేడియర్‌ అధికారి ఐడీ కార్డు తయారు చేశాడు. దగ్గరుండి ద ర్శన ఏర్పాట్లు చేయాలని బ్రహ్మయ్య తన అసిస్టెంట్‌ చంద్రశేఖర్‌రెడ్డిని తిరుమలకు పంపాడు. అయితే, చంద్రశేఖర్‌రెడ్డి తాను, తన సతీమణి పేర్లు కూడా జత చేసి ఆరుగురికి వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్లు పొందాడు. సోమవారం ఉద యం వారంతా దర్శనానికి రాగా, విజిలెన్స్‌ అధికారులు గుర్తించి పోలీసులకు అప్పగించారు.

Updated Date - Dec 17 , 2024 | 04:48 AM