Share News

Sakshi Bad Manner: నిన్నటి వరకు డేటా చోరీ.. నేడు కంటెంట్‌లో కల్తీ..

ABN , Publish Date - Oct 05 , 2024 | 05:43 PM

ఏదైనా సంఘటన జరిగినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఇతర సంస్థల పేర్లను తమ వార్తల్లో ప్రస్తావిస్తుంది. కానీ సాక్షి వెబ్‌సైట్‌లో పోస్టు చేసే వార్తల్లో ఓ కుట్ర ప్రకారం ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ట్యాగ్‌ను ఉపయోగిస్తోంది. ఎవరైనా ఏబీఎన్-ఆంధ్రజ్యోతి పేరుతో వార్తలను సెర్చ్ చేస్తే వారికి సాక్షి వెబ్‌సైట్‌లో వార్తలు వచ్చేలా ..

Sakshi Bad Manner: నిన్నటి వరకు డేటా చోరీ.. నేడు కంటెంట్‌లో కల్తీ..
Conspiracy

కుక్కతోక వంకర సామెత సరిగ్గా వైసీపీ అధ్యక్షుడి సొంత పత్రిక సాక్షికి సరిపోతుంది. వార్తల పేరుతో ఇతర పత్రికలు, సంస్థలపై కుట్రలు చేయడం పరిపాటిగా మారింది. తమ అధినేత మెప్పుకోసం పత్రికా విలువలను గాలికొదిలేసి.. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది. సాక్షి వెబ్‌సైట్‌లో ప్రచురించే వార్తల్లో కొన్ని ఎంపిక చేసిన వార్తలకు ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ట్యాగ్‌ను ఉపయోగిస్తోంది. ఏదైనా వార్తను పోస్టు చేసేటప్పుడు దానికి సంబంధించిన ట్యాగ్‌లను ఇవ్వడం సర్వ సాధారణం. ఒక పత్రిక లేదా సంస్థ ఇతర పత్రికలు, సంస్థలకు సంబంధించిన ట్యాగ్‌లను తమ వార్తల్లో ఉపయోగించదు. ఎక్కువమంది ప్రజలు సెర్చ్ చేసే, ట్రెండింగ్ కీ వర్డ్స్‌ను, ట్యాగ్‌లను మాత్రమే ఉపయోగిస్తుంది. ఏదైనా సంఘటన జరిగినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఇతర సంస్థల పేర్లను తమ వార్తల్లో ప్రస్తావిస్తుంది. కానీ సాక్షి వెబ్‌సైట్‌లో పోస్టు చేసే వార్తల్లో ఓ కుట్ర ప్రకారం ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ట్యాగ్‌ను ఉపయోగిస్తోంది. ఎవరైనా ఏబీఎన్-ఆంధ్రజ్యోతి పేరుతో వార్తలను సెర్చ్ చేస్తే వారికి సాక్షి వెబ్‌సైట్‌లో వార్తలు వచ్చేలా ట్యాగ్‌ను ఉపయోగిస్తోంది. ప్రజలను, ఆంధ్రజ్యోతి వెబ్‌సైట్ పాఠకులు, ఏబీఎన్ వీక్షకులను తప్పుదోవ పట్టించేలా సాక్షి ఓ పెద్ద కుట్రకు తెరలేపింది. ఆంధ్రజ్యోతి వెబ్‌సైట్‌కు రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ చూసి.. సంస్థ ట్రాఫిక్‌ పెరగకుండా ఉండేందుకు.. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు సాక్షి పనిగట్టుకుని కుట్రలకు పాల్పడుతుందనే విషయం స్పష్టమవుతోంది.

1.jpg


వంకర బుద్ధి..

తాజావార్తలను ప్రజలకు ఎప్పటికప్పుడు అందించడంలో ఆంధ్రజ్యోతి వెబ్‌సైట్ ముందువరుసలో ఉంటుందన్న విషయం ప్రజలందరికీ తెలిసిందే. తాజా వార్తలు, సమకాలీన రాజకీయ వార్తల కోసం తెలుగువారంతా ఎక్కువుగా వీక్షించే వెబ్‌సైట్లలో ఆంధ్రజ్యోతి తెలుగు వెబ్‌సైట్ ఒకటి. ఇటీవల కాలంలో ఆంధ్రజ్యోతికి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేని సాక్షి.. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ట్యాగ్‌తో తన ట్రాఫిక్‌ను పెంచుకునేందుకు కుట్ర పన్నిందనే అనుమానాలు కలుగుతున్నాయి. గత కొన్నేళ్లుగా ఆంధ్రజ్యోతి సంస్థపై సాక్షి తప్పుడు ప్రచారం చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ప్రజలకు వాస్తవాలు తెలుసనే కారణంతోనే సాక్షి తప్పుడు వార్తలు, కుట్రలపై పెద్దగా స్పందించలేదు. కానీ రోజురోజుకు సాక్షి వికృత చేష్టలు ఎక్కువైపోతున్నాయి. ప్రజలను తప్పుదోవపట్టించేందుకు అవసరం లేకున్నా ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ట్యాగ్‌లైన్‌ను ఉపయోగిస్తూ సంస్థకు వ్యతిరేకంగా కొన్ని వార్తలను ప్రచురించి.. వాటిని బలవంతంగా ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తోంది.

2.jpg


ఇప్పటికైనా మారతారా..

పోటీప్రపంచంలో తన వెబ్‌సైట్‌కు వీక్షకులను పెంచుకునేందుకు, ప్రజలను ఆకట్టుకునేందుకు ఏదైనా సంస్థ ప్రయత్నం చేయడంలో తప్పులేదు. కానీ ఇతర సంస్థలపై కుట్రలు, కుతంత్రాలు పన్నడం ఎందుకు. ఇతరులపై బురద జల్లినంత మాత్రన..సాక్షిపై ప్రజలకున్న దురాభిప్రాయం పోదు. ఇప్పటికైనా సాక్షి తన వంకర బుద్ధిని మార్చుకుని.. ప్రజల మనసులను గెలుచుకునే ప్రయత్నం చేయాలి కానీ.. ఏబీఎన్-ఆంధ్రజ్యోతిపై కుట్ర చేయడం ద్వారా ఏమి సాధించలేదు. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ట్యాగ్‌ను దురుద్దేశ పూర్వకంగా ఉపయోగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. భవిష్యత్తులో ఇలాంటి కుట్రలకు పాల్పడితే చట్టపరంగా చర్యలకు వెనుకాడమని తెలియజేస్తున్నాము.

3.jpg


ఈ వార్త ప్రచురణ తర్వాత సాక్షి యాజమన్యం హడావుడిగా స్పందించి దీనిని డిలీట్ చేసే అవకాశాలు లేకపోలేదు. తమ దొంగబుద్ధులు బయటపడటంతో ప్రజల ముందు చులకన కాకుండా ఇప్పటివరకు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు దీనిని డిలీట్ చేయ్యొచ్చు.. కానీ భవిష్యత్తులో ఇలాంటి కుట్రలకు పాల్పడకుండా నీతి, నిజాయితీగా ముందుకెళ్లేందుకు ప్రయత్నిస్తే బెటర్.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Latest Telugu News Click Here

Updated Date - Oct 05 , 2024 | 05:52 PM