AP Police : పత్తాలేని వర్మ
ABN , Publish Date - Nov 28 , 2024 | 04:32 AM
సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ(ఆర్జీవీ) అజ్ఞాతంలో ఉండి విడుదల చేసిన వీడియో కలకలం రేపుతోంది.
తనకు భయం లేదంటూ వీడియో విడుదల
హైదరాబాద్, కోవైల్లో పోలీసుల గాలింపు
ఒంగోలు క్రైం, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ(ఆర్జీవీ) అజ్ఞాతంలో ఉండి విడుదల చేసిన వీడియో కలకలం రేపుతోంది. తనకు ఎలాంటి భయం లేదని చెబుతూ.. తనపై ఫిర్యాదు చేసిన వారికి ఏమాత్రం అర్హత లేదని ఆయన అందులో స్పష్టం చేశారు. పోలీసు విచారణకు సహకరిస్తానని చెప్పి.. తప్పించుకుని తిరుగుతున్న ఆయన వీడియోలో వివరణ ఇవ్వడం చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో పెట్టిన అసభ్యకరమైన పోస్టులకు సంబంధించి ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసు స్టేషన్‌లో తనపై నమోదైన కేసులో రెండుసార్లు ఆయన విచారణకు గైర్హాజరైన సంగతి తెలిసిందే. బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు గురువారానికి వాయిదావేసింది. ఈ నేపథ్యంలో వర్మ కోసం పోలీసులు హైదరాబాద్, కోయంబత్తూరుల్లో గాలిస్తున్నారు. వర్మపై రెండు రాష్ట్రాల్లో తొమ్మిది కేసులు నమోదై ఉన్నాయి.