Share News

AP Govt: స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు తొలి సమావేశం.. కీలక నిర్ణయం

ABN , Publish Date - Nov 19 , 2024 | 09:16 PM

రాష్ట్రంలో పెట్టబడులు, మౌలిక సదుపాయాల కల్పనలో వేగంగా అడుగులు వేసేందుకు ముఖ్యమంత్రి నేతృత్వంలో స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు ఏర్పాటైన సంగతి తెలిసిందే. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ కమిటీని ఏర్పాటు చేసిన విషయం విధితమే.

AP Govt: స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు తొలి సమావేశం.. కీలక నిర్ణయం

అమరావతి, నవంబర్19: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 33,966 ఉద్యోగాలు కల్పించేందుకు రూ. 85 వేల కోట్లు పెట్టుబడులకు స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) ఆమోదం తెలిపింది. మంగళవారం వెలగపూడిలోని సచివాలయంలో ఎస్ఐపీబీ తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే భారీ పరిశ్రమల ఏర్పాటుకు భూముల కోసం ల్యాండ్ పూలింగ్ విధానం చేపట్టాలని సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులకు సూచించారు. ఈ పరిశ్రమలకు భూములు ఇచ్చే వారికి స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా.. అదే సంస్థలో ఉద్యోగ, ఉపాధి కల్పించేలా ప్రతిపాదనలు ఉండాలన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను సాకారం చేసేలా ఒప్పందాలను నిత్యం ట్రాక్ చేయాలని ఉన్నతాధికారులకు సిఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ సమావేశానికి పలువురు మంత్రులతోపాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Also Read: ఉన్నతాధికారులు కీలక నిర్ణయం.. దుర్గమ్మ భక్తులకు సూచన


రాష్ట్రంలో పెట్టబడులు, మౌలిక సదుపాయాల కల్పనలో వేగంగా అడుగులు వేసేందుకు ముఖ్యమంత్రి నేతృత్వంలో స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు ఏర్పాటైన సంగతి తెలిసిందే. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ కమిటీని ఏర్పాటు చేసిన విషయం విధితమే. ఈ బోర్డులో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్, రెవెన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్, మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టిజి భరత్, రోడ్లు, భవనాలు శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి, ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, పర్యాటక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సభ్యులుగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మెంబర్ కన్వీనర్‌గా ఉంటారు.

Also Read: CM Chandrababu Naidu: రేపు మళ్లీ కేబినెట్ భేటీ


అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా ఏర్పాటైన స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ కమిటీలో పరిశ్రమల శాఖ కమిషనర్ మెంబర్ కన్వీనర్‌గా, ఫైనాన్స్, రెవెన్యూ, ఇరిగేషన్, పరిశ్రమలు, ఇతర శాఖల స్పెషల్ చీఫ్ సెక్రెటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెక్రెటరీలను సభ్యులుగా నియమించారు.

Also Read: కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌పై హైకోర్టు కీలక తీర్పు

Also Read: Maharashtra Elections: పోలింగ్ వేళ.. చిక్కుల్లో బీజేపీ


చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. అనంతరం రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. అలాగే యువతకు ఉద్యోగ, ఉపాధికి సంబంధించిన కీలక అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగా ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది.

Also Read: శబరిమలకు వెళ్తున్నారా.. వాటితో జాగ్రత్త

Also Read: దబ్బ పండు వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా..?


మరోవైపు బుధవారం సాయంత్రం 4.00 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సూపర్ సిక్స్ పథకాల్లో మిగిలిన వాటిని అమలు చేసేందుకు కార్యచరణను సైతం సిద్దం చేయనున్నట్లు తెలుస్తుంది. అందులోభాగంగా పలు అంశాలకు ఈ కేబినెట్ సమావేశంలో ఆమోద ముద్ర పడనున్నట్లు సమాచారం.

Also Read: KTR: రేవంత్ సర్కార్‌‌కి ప్రశ్నలు సంధించిన కేటీఆర్

For AndhraPradesh News And Telugu News..

Updated Date - Nov 19 , 2024 | 09:16 PM