-
-
Home » Andhra Pradesh » Ganesh Chaturthi Celebrations: Vibrant Idols, Devotional Fervor Unite India
-
Ganesh Chaturthi: నేటి తాజా వార్తలు
ABN , First Publish Date - Sep 07 , 2024 | 09:51 AM
దేశ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ప్రారంభమయ్యాయి. గణపతి వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నారు. ఉదయం 11 గంటలకు ఖైరతాబాద్ బడా గణేష్ తొలి పూజలు అందుకున్నారు.
Live News & Update
-
2024-09-07T17:55:09+05:30
అలర్ట్.. అలర్ట్..
హైదరాబాద్: జంట జలాశయాల గేట్లు ఎత్తివేత.
ఉస్మాన్ సాగర్ 2 గేట్లు
హిమాయత్ సాగర్ ఒక గేటు ఎత్తిన జలమండలి అధికారులు.
మూసి పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన బల్దియా.
-
2024-09-07T17:47:54+05:30
బీసీ నేతకు పీసీసీ పదవి.. అందుకేనట..
హైదరాబాద్: బీసీ నేతకు పీసీసీ పదవి ఏఐసీసీ ఇచ్చింది: జగ్గారెడ్డి
పీసీసీ చీఫ్ కోసం చాలామంది నేతలు పోటీ పడ్డారు
బీసీ కోణంలో మహేష్, మధు యాష్కీ, ఎస్సీ సామాజిక వర్గం నుంచి సంపత్, లక్ష్మణ్
ఎస్టీ సామాజిక వర్గం నుండి బలరాం నాయక్, శంకర్ పేర్లను పరిశీలించారు
బీసీలకు ఇవ్వాలనే ఉద్దేశంతో మహేష్ కుమార్ గౌడ్ కు ఇచ్చింది
నాతో నిన్నటి వరకు వర్కింగ్ ప్రెసిడెంగ్‌గా మహేశ్ కుమార్ పనిచేశారు.
-
2024-09-07T17:29:44+05:30
పోటెత్తిన భక్తులు
హైదరాబాద్ : ఖైరతాబాద్ మహాగణపతి వద్ద భక్తుల కోలాహలం.
రెండు కిలో మీటర్ల మేర బారులు తీరిన భక్తులు.
మహా గణపతి దర్శనానికి గంటకు పైగా సమయం.
భక్తులతో కిటకిటలాడుతున్న క్యూ లైన్లు.
ఖైరతాబాద్, లక్డికపూల్, ట్యాంక్ బండ్ మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జాం.
-
2024-09-07T15:26:31+05:30
ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకున్న గవర్నర్
ఖైరతాబాద్ మహాగణపతి వద్ద తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
-
2024-09-07T15:24:44+05:30
ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకున్న గవర్నర్
ఖైరతాబాద్ మహా గణపతిని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దర్శించుకున్నారు.
గవర్నర్ జిష్ణుదేవ్ శర్మకు స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నాయకులు ఘన స్వాగతం పలికారు.
-
2024-09-07T13:37:29+05:30
జనసేన కేంద్ర కార్యాలయంలో..
మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో సంప్రదాయ బద్దంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించారు.
జనసేన కార్యాలయంలో నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.
విఘ్నాలు లేకుండా రాష్ట్రాభివృద్ధికి దైవ ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించిన పవన్ కళ్యాణ్
విఘ్నేశ్వరుడి కరుణకటాక్షాలతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో గడపాలని కోరిన పవన్ కళ్యాణ్
పవన్ తో పాటు పూజలో పాల్గొన్న ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, జనసేన నేతలు కళ్యాణం శివ శ్రీనివాస్, చిల్లపల్లి శ్రీనివాసరావు
-
2024-09-07T13:28:12+05:30
మహాగణపతిని దర్శించుకున్న ఈటెల
మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్నారు.
-
2024-09-07T12:28:22+05:30
దొండకాయలతో వినాయకుడు..
వినాయక చవితి సందర్భంగా చిత్తూరు జిల్లా కాణిపాకం ఆలయంలో దొండకాయలు, పూలతో వినాయకుడి విగ్రహన్ని తయారుచేశారు.
దొండకాయలు, పూలతో చేసిన విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
-
2024-09-07T12:19:51+05:30
అతిపెద్ద మట్టి విగ్రహం..
ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అతిపెద్ద మట్టి విగ్రహన్ని వరంగల్ ఎల్లంబజార్‌లో ఏర్పాటు చేశారు.
వ్యాపారి ఆకుతోట సంజీవ్ 40అడుగుల మట్టి వినాయకుడిని ఏర్పాటు చేశారు.
-
2024-09-07T12:12:41+05:30
మహాగణపతి వద్ద సీఎం రేవంత్ కామెంట్స్
వినాయక చవితి వేడుకలను దేశంలోనే అత్యంత గొప్పగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి నిర్వహిస్తోంది.
1954 నుంచి 2024 వరకు ఖైరతాబాద్ వినాయకుడు దేశం దృష్టిని ఆకర్షించడం ఎంతో గర్వకారణం
గణనాథుడికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించడం ద్వారా సుఖసంతోషాలు, ప్రశాంతత, పాడిపంటలతో రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళ్తుంది.
గణేశ్ ఉత్సవాల నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది
హైదరాబాద్‌లో లక్షా40వేల విగ్రహాలను ప్రతిష్టిస్తున్నారు.
భక్తుల కోరిక మేరకు గణేశ్ మండపాల వద్ద ఉచిత విద్యుత్తు అందిస్తున్నాం
ఈ ఏడాది అకాల వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు
దేవుడి దయతో ఎక్కువ నష్టం వాటిల్లకుండా బయటపడ్డాము.
సప్త ముఖ మహా గణపతి విగ్రహాన్ని రూపొందించిన శిల్పి రాజేంద్రన్‌ని సీఎం రేవంత్ రెడ్డి సత్కరించారు.
-
2024-09-07T12:00:40+05:30
మహాగణపతి వద్ద సీఎం రేవంత్ కామెంట్స్
భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించడం అభినందనీయం
ఖైరతాబాద్‌లో 70 ఏళ్లుగా గణేశ్ వేడుకల నిర్వహణ ఎంతో గర్వకారణం
దేశంలోనే ఖైరతాబాద్ వినాయకుడు ఆదర్శం
-
2024-09-07T11:53:29+05:30
సీఎం రేవంత్ ప్రత్యేక పూజలు..
ఖైరతాబాద్ మహాగణపతి వద్ద తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రేవంత్ రెడ్డికి స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ ఘన స్వాగతం పలికారు.
రేవంత్ రెడ్డిని ఘనంగా సత్కరించి, జ్ఞాపిక అందజేశారు.
సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ ఖైరతాబాద్ బడా గణేశ్‌ను దర్శించుకున్నారు.
-
2024-09-07T11:35:41+05:30
ఖైరతాబాద్ గణేశ్‌కు తొలిపూజ..
ఖైరతాబాద్ మహాగణపతి వద్దకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు.
బడా గణేశ్‌కు నిర్వహించిన తొలిపూజలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
-
2024-09-07T11:20:07+05:30
రేవంత్ నివాసంలో..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. గణేశ్ పూజలో ముఖ్యమంత్రి దంపుతులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
సీఎం నివాసంలో జరిగిన వినాయక పూజలో టీపీసీసీ నూతన అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ దంపతులు పాల్గొన్నారు.
-
2024-09-07T10:54:04+05:30
అత్యంత సంపన్న గణనాథుడు..
దేశంలోనే అత్యంత సంపన్నుడైన గణనాధుడిని ముంబైలో ఏర్పాటుచేశారు.
ముంబైలోని GSB సేవా మండల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయకుడిని 66 కిలోల బంగారు ఆభరణాలతో అలంకరించారు. 325 కిలోల వెండితోత పాటు ఇతర విలువైన వస్తువులతో అలంకరించారు.
ఈనెల 11వ తేదీ వరకు జరిగే గణేశ్ ఉత్సవాల కోసం నిర్వహకులు రూ.400.58 కోట్ల బీమా కవరేజీ తీసుకున్నారు.
ముంబైలో లాల్ బాగ్చా రాజా గణపతికి అనంత్ అంబానీ 20 కిలోల బంగారు కిరీటాన్ని విరాళంగా ఇచ్చారు.
-
2024-09-07T10:43:49+05:30
ముంబై నగరంలో..
ముంబై నగరంలో మొత్తం 2,500కు పైగా వినాయక మండపాలను ఏర్పాటుచేశారు.
3వేలకు పైగా దరఖాస్తులు రాగా 2,700 మండపాలకు అనుమతులు మంజూరు చేశారు.
ముంబై నగరంలో లాల్ బాగ్చా రాజా గణేశ్ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
-
2024-09-07T10:24:17+05:30
కాసేపట్లో తొలిపూజ..
ఖైరతాబాద్‌లో ఏర్పాటుచేసిన సప్త ముఖ మహా గణపతి కాసేపట్లో తొలి పూజలు అందుకోనున్నారు. తొలి పూజ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొంటారు.
-
2024-09-07T10:12:04+05:30
ఖైరతాబాద్‌లో..
ఖైరతాబాద్‌లో 70 అడుగుల భారీ మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
70 ఏళ్ల నుంచి ఇక్కడ వినాయకుడిని ఏర్పాటు చేస్తున్నారు.
ఏడు ముఖాల శఖ్తి మహాగణపతిగా భక్తులకు దర్శనమిస్తున్న ఖైరతాబాద్ బడా గణేశ్
ఉదయం 11 గంటలకు ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి
ఖైరతాబాద్ బడా గణేశ్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించనున్న సీఎం రేవంత్ రెడ్డి
సీఎంతో పాటు వినాయకుడి దర్శనానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్
మధ్యాహ్నం 3గంటలకు ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోనున్న గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
-
2024-09-07T09:59:04+05:30
కాణిపాకంలో..
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామికి పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టు వస్త్రాలు సమర్పించారు.
పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ,ఎస్పీ మణికంఠ చందులు, ఆలయ ఈవో గురు ప్రసాద్ తో పాటు పలువురు అధికారులు పట్టు వస్త్రాలు సమర్పించారు.
-
2024-09-07T09:50:23+05:30
దేశ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు
దేశ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ప్రారంభమయ్యాయి. గణపతి వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నారు. ఉదయం 11 గంటలకు ఖైరతాబాద్ బడా గణేష్ ప్రత్యేక పూజలు అందుకుంటారు. ఆ తర్వాత సాధారణ భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.