Share News

Ganta Srinivasa Rao : ‘తెలుగు’ రాజకీయాలను శాసించేది కాపులే!

ABN , Publish Date - Dec 16 , 2024 | 06:16 AM

తెలుగు రాష్ట్రాల రాజకీయాలను శాసించే శక్తి ఒక్క మున్నూరు కాపులకే ఉందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు.

Ganta Srinivasa Rao : ‘తెలుగు’ రాజకీయాలను శాసించేది కాపులే!

  • పార్టీలు వేరైనా కాపులంతా కలిసికట్టుగా ఉండాలి: గంటా

కేసముద్రం (మహబూబాబాద్‌ జిల్లా), డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల రాజకీయాలను శాసించే శక్తి ఒక్క మున్నూరు కాపులకే ఉందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. తెలంగాణలోని మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం అమినాపురంలో మూన్నూరుకాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన ఎంకే కన్వెన్షన్‌ను సంఘం అధ్యక్షుడు చందా గోపితో కలిసి గంటా ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లోని కాపుల్లో రకరకాల పేర్లతో విభజించి ఐక్యతను దెబ్బతీయాలని చూస్తున్నారని, అన్ని రకాల కాపులు ఒక్కటేనని పేర్కొన్నారు. పార్టీలు వేరైనా మున్నూరుకాపులంతా కలిసికట్టుగా ఉండాలని సూచించారు. ఇక్కడి కన్వెన్షన్‌ హాల్‌కు రూ.5 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు.

Updated Date - Dec 16 , 2024 | 06:17 AM