Share News

Nara Lokesh: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మంత్రి లోకేశ్100 రోజుల యాక్షన్ ప్లాన్‌ను రెడీ

ABN , Publish Date - Jun 19 , 2024 | 11:39 AM

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఉద్యోగ కల్పన కోసం ఐటీ మంత్రి నారా లోకేష్ యత్నిస్తున్నారు. దీనిలో భాగంగా.. ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఉద్యోగాల కోసం 100 రోజుల యాక్షన్ ప్లాన్‌ను ఆయన సిద్ధం చేశారు. బాధ్యతల స్వీకరణకు ముందు నుంచే లోకేష్ పని ప్రారంభించారు.

Nara Lokesh: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మంత్రి లోకేశ్100 రోజుల యాక్షన్ ప్లాన్‌ను రెడీ

అమరావతి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పన కోసం ఐటీ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఉద్యోగాల కోసం 100 రోజుల యాక్షన్ ప్లాన్‌ను లోకేశ్ సిద్ధం చేశారు. బాధ్యతల స్వీకరణకు ముందు నుంచే లోకేశ్ పని ప్రారంభించారు. రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిగా బాధ్యతల స్వీకారానికి ముందే యాక్షన్ ప్లాన్ రూపొందించారు. హెచ్ఆర్‌డీ మంత్రిగా విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడంపై అధికారులతో ఆయన సమీక్షలు నిర్వహించారు.


త్వరలోనే ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులతో నారా లోకేశ్ భేటీ కానున్నారు. ఇకపై సంబంధం లేని పనులను ఉపాధ్యాయులకు అప్పగించరాదని మంత్రి నారా లోకేష్ యోచిస్తున్నారు. ఏళ్ల తరబడి ఉన్నత విద్యలో ఉన్న సమస్యలను పరిష్కరించడం, కోర్టుల్లో ఉన్న చిక్కుముడులను తొలగించి ఫ్యాకల్టీ రిక్రూట్‌మెంట్ చేసేందుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని వెల్లడించారు. అయిదేళ్ల జగన్ పాలనలో ఉనికి కోల్పోయిన ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖలకు మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తామని నారా లోకేష్ స్పష్టం చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

Gorantla Butchaiah Chowdary: అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల.. ఫోన్ చేసి చెప్పిన పయ్యావుల

Kane Williamson: కెప్టెన్సీ నుంచి వైదొలగిన కేన్ విలియమ్సన్.. కారణమిదే!


Read Latest AP News and Telugu News

Updated Date - Jun 19 , 2024 | 12:25 PM