Guntur: కొమెరపూడి.. టీచర్లకు నిలయం
ABN , Publish Date - Nov 08 , 2024 | 08:29 AM
ఒకే ఇంటి లో ఇద్దరు, ముగ్గురు ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. ఉపాధ్యాయవృత్తిలో ఉన్న వారి తల్లిదం డ్రులంతా ఎక్కువగా వ్యవసాయ కూలీలు, చిన్న వ్యాపారాలు చేసుకొనేవారే. సాధారణ, దిగువ, మధ్య తరగతి వారు నివసించే ఈ గ్రామంలో రెక్కాడితే గాని డొక్కాడని ని రుపేద ముస్లింలు ఎక్కువగా ఉన్నారు.
- గ్రామంలో 90 మంది వరకు ఉపాధ్యాయులు
- యువతకు ఉపాధ్యాయ వృత్తిపై మక్కువతోనే..
మాతృ దేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవో భవ’ అంటారు. జన్మనిచ్చిన తల్లిదండ్రుల తరువాత స్థానం ఉపాధ్యాయులది. అలాంటి ఉపాధ్యా యులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది సత్తెనపల్లి మండలంలోని కొమెరపూడి. ఈ గ్రామంలో ఎక్కువ మంది ఉపాధ్యాయులుగా స్థిరపడ్డారు. 90 మంది వరకు ఉంటారు. పేద కుటుంబాల్లోని వ్యక్తులు చదువుల తల్లిని నమ్ముకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగారు. ‘ఒక ఇంజనీరు తప్పు చేస్తే తాను నిర్మించిన బ్రిడ్జి మాత్ర మే కూలిపోతుంది. ఉపాధ్యాయుడు తప్పు చేస్తే సమాజమే పెడదారి పడుతుంది’ అనేది లోకోక్తి. బాధ్యతాయుతంగా ఉంటున్న ఈ ఉపాధ్యాయులు ఈ గ్రామానికే వన్నె తెస్తున్నారు.
సత్తెనపల్లి(పల్నాడు): ఒకే ఇంటి లో ఇద్దరు, ముగ్గురు ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. ఉపాధ్యాయవృత్తిలో ఉన్న వారి తల్లిదం డ్రులంతా ఎక్కువగా వ్యవసాయ కూలీలు, చిన్న వ్యాపారాలు చేసుకొనేవారే. సాధారణ, దిగువ, మధ్య తరగతి వారు నివసించే ఈ గ్రామంలో రెక్కాడితే గాని డొక్కాడని ని రుపేద ముస్లింలు ఎక్కువగా ఉన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: CM Chandrababu : వైసీపీ సైకోలకు వాత ఖాయం
ప్రతి డీఎస్సీ లోను ముస్లింపాలెంకు చెందిన యువతీ యువకులు ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికవుతున్నారు. కొమెరపూడిలో 10వ తరగతి వరకు చదువుకొని అక్కడి నుంచి సత్తెన పల్లిలో ఇంటర్ పూర్తి చేసి బీఈడీ పూర్తిచేసిన వారిలో ఎక్కువ మంది ఉపాఽధ్యాయవృత్తిలోనే ఉన్నారు. ప్రభుత్వం ఉర్దూ టీచర్ పోస్టులను ఎక్కువగా భర్తీ చేస్తుండటంతో.. ఇంటర్ మీడియట్‌లో రెండవ లాంగ్వేజ్‌గా ‘ఉర్దూ’ తీసుకుని, ఇంటర్ అనంతరం బీఈడీలో కూడా ఉర్దూ పూర్తిచేసి ఉపాధ్యాయవృ త్తిలో స్థిర పడుతున్నారు. దీంతో ఆ గ్రామంలో చదువుకునే యువత దృష్టి ఉపాధ్యాయ వృత్తిపైనే పడింది. పది మంది వరకు విశ్రాంత ఉపాధ్యాయులు ఉన్నారన్నారు.
బోధనపై మక్కువతో..
గ్రామంలోని ఐదారు ముస్లిం కుటుంబాల్లో భార్యాభర్తలు, అన్నదమ్ములు, అక్కా చెల్లెలు, అన్నా చెల్లెలు ఉపాధ్యాయులుగా ఉండటం విశేషం. ఈ తరం వారు వారిని చూసి బోధనపై ఎక్కువగా మక్కువ పెంచుకున్నారు. టీటీసీ, బీఈడీ లాంటి చదువులు చదివి బోధనలో స్థిర పడుతున్నారు. ముస్లింపాలెంలో ఎక్కువగా యువతీ యువకులు ఉపాధ్యాయ కొలువు పొందాలన్నదే లక్ష్యంగా చదివారు. నాలుగు వందల వరకు ముస్లిం కుటుంబాలు ఉంటే మూడు వందల కుటుంబాల్లో ఒక రిద్దరు డిగ్రీలు, పీజీలు, టీటీసీ, బీఈడీ చేశారంటే నాటి యువతలో బోధనపై వారికి ఎంత మక్కువ ఉందో అర్థమవుతుంది.
ఐదుగురినీ బీఈడీ చదివించారు :
ఎస్‌ఎం రెహ్మాన్, సెకండరీ గ్రేడ్ టీచర్, ఫణిదం
మానాన్న ఉపాధ్యాయుడు. మేము ఐదుగురు సంతా నం. ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. అంద రినీ బీఈడీ చదివించారు. ముగ్గురూ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నాం. ఒక అమ్మాయి కూడా సెకండరీ గ్రేడ్ టీచర్. తక్కువ జీతంతో మానాన్న కష్టపడి చదివించాడు. క్రమశిక్షణగా చదివి ఉపాధ్యాయ ఉద్యోగాలను మెరిట్‌లో సాధించినందుకు సంతోషంగా ఉంది.
రైతు కూలీ కుటుంబం మాది :
షేక్ హజరాబీ, సెకండరీ గ్రేడ్ టీచర్, కంకణాలపల్లి
రైతు కూలీ కుటుంబం మాది. మా ఇంట్లో ఐదుగురు మగపిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు. తల్లిదండ్రులు కూలీ పనులు చేసుకుంటూ మమ్మల్ని కష్టపడి చదివించారు. నేను బీఈడీ పూర్తి చేసి 2008లో డీఎస్సీలో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా ఎంపికయ్యాను. సత్తెనపల్లి మండలం కంకణాలపల్లి పాఠశాలలో పని చేస్తున్నాను. గ్రామంలోని ముస్లిం పిల్లలంతా ప్రభుత్వ హైస్కూల్‌లో చదివి మంచి స్థాయికి ఎదిగాం. ప్రభుత్వ ఉద్యోగాలు పొందటానికి ముస్లిం పాలెంలో యువత ఎక్కువగా పోటీ పడతారు.
ఎంతో గర్వంగా ఉంది
మా తండ్రి ఉపాధ్యాయునిగా పని చేశారు. నేను కూడా ఉపాధ్యాయ వృత్తిపై మక్కువతో బీఈడీ పూర్తి చేసిన అనంతరం డీఎస్సీలో ఉపాధ్యా యురాలిగా ఎంపికై క్రోసూరు మండలం అనంతవరం పాఠశాలలో పని చేస్తున్నాను. ఉపాధ్యాయ వృత్తి ద్వారా భావి భారత పౌరు లను తీర్చిదిద్దే అవకాశం లభించటం సంతోషంగా ఉంది. మా గ్రామం లో ఉన్నంత మంది ఉపాధ్యాయులు బహుశ ఎక్కడ ఉండరేమో. ఈ విష యాన్ని మేము బయట ఎక్కడైనా చెప్పుకోవాలన్నా ఎంతో గర్వంగా ఉంటుంది.
-షేక్ రజియా బేగం, సెకండరీ గ్రేడు టీచర్, అనంతవరం
ఎందరికో ఓనమాలు నేర్పిన పాఠశాల : జీ సదాశివరెడ్డి, దొడ్లేరు
ఉపాధ్యాయ వృత్తిలో గౌరవం ఎక్కువగా లభిస్తుంది. ఉపాధ్యాయ వృత్తిపై మక్కువతో బీఈడీ పూర్తి చేసి డీఎస్సీలో ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యాను. క్రోసూరు మండలం దొడ్లేరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్నాను. కొమెరపూడికి జిల్లా పరిషత్ హైస్కూల్ గుండె కాయ లాంటిది. నా లాగా ఎంద రికో ఓనమాలు నేర్పి ఉద్యోగులుగా తీర్చిదిద్దింది.
తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులు
మా గ్రామంలో ఉపాధ్యాయ ఉద్యోగం చేసే వారి సంఖ్య. ఎక్కువ. వీరే కాకుండా ఇతర ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. వీరందరినీ కొమెరపూడి హైస్కూల్ ఉపాధ్యాయులు తీర్చిదిద్దారు. హైస్కూల్ చదువులు అయిపో యిన తర్వాత బయట చదువుకొని ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. ఇది చాలా సంతోషం.
యర్రా వెంకటేశ్వరరావు, పాలకేంద్రం అధ్యక్షుడు, కొమెరపూడి
ఏ ఊరిలో లేరు: దేవరకొండ వెంకటరావు, మాజీ సర్పంచ్, కొమెరపూడి
మా గ్రామంలో ఉన్నంత మంది ఉద్యోగులు ఏ ఊరిలో ఉండరు. ఎక్కువ మంది ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. అందులో ముస్లింపాలెంలోని యువతీ యువకులు ఎక్కువగా ఉన్నారు. ఇంకా సచివాలయ ఉద్యోగులు, మిలటరీలో పని చేసే వారు, పోలీసు శాఖలో పని చేసే వారు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని మేము బయట చెప్పకోవాలంటే ఎంతో గర్వంగా ఉంటుంది.
ఈవార్తను కూడా చదవండి: పశ్చిమ బెంగాల్ నుంచి నగరానికి హెరాయిన్.. ఐటీ కారిడార్‌లో విక్రయం
ఈవార్తను కూడా చదవండి: నీళ్ల బకెట్లో పడి ఏడాదిన్నర చిన్నారి మృతి
ఈవార్తను కూడా చదవండి: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు దివాలా: కిషన్‌రెడ్డి
ఈవార్తను కూడా చదవండి: వద్దొద్దంటున్నా.. మళ్లీ ఆర్‌ఎంసీ!
Read Latest Telangana News and National News