Lanka dinakar: గుంటూరు అభివృద్ధిపై లంకా దినకర్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Dec 21 , 2024 | 04:49 PM
Andhrapradesh: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వికసిత భారత్ మోడీ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాను అభివృద్ధి రంగంలో ముందు వరుసలో ఉంచుతామని లంకాదినకర్ అన్నారు. నగరంలో అండర్ డ్రైనేజ్ రూ.540 కోట్లతో అభివృద్ధి చేయాలని చూస్తే గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు.
గుంటూరు, డిసెంబర్ 21: 20 సూత్రాల అమలు విషయంలో కేంద్ర పథకాలపై అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించామని 20 సూత్రాల కమిటీ చైర్మన్ లంకా దినకర్ (20 points Chairman Lankadinakar) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వికసిత భారత్ మోడీ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాను అభివృద్ధి రంగంలో ముందు వరుసలో ఉంచుతామన్నారు. నగరంలో అండర్ డ్రైనేజ్ రూ.540 కోట్లతో అభివృద్ధి చేయాలని చూస్తే గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు. ఉపాధి హామీ లోపాలపై ఆడిట్ చేయాలని సూచించారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో మహిళల అభివృద్ధి, త్రాగునీటి కుళాయిల కోసం 70 వేల కోట్ల రూపాయలు అభివృద్ధి చేయాలని అంచనాలు వేశామన్నారు.
Year Ender 2024: ఈ ఏడాది సొంత ఇలాకాలో సీఎం రేవంత్ రెడ్డికి నిరసన సెగ
నగరంలో త్రాగునీటి కోసం రూ.124 కోట్లతో అమృత్ -2 పథకాన్ని అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. రేషన్ కార్డులు రాష్ట్రాల్లో అత్యధికంగా ఉన్నాయని... త్వరలోనే నూతన రేషన్ డీలర్లను నియమిస్తామని చెప్పారు. 45 వేల ఇళ్లను పూర్తి చేయకుండా అసంపూర్తిగా వదిలి వేసిన పరిస్థితి నెలకొందని తెలిపారు. కేవలం 17419 టిడ్కో గృహాలు మాత్రమే ప్రారంభం కావడం గమనార్హమన్నారు. వ్యవసాయ ఆధారిత జిల్లాలో ఫసల్ భీమా పధకం రైతులకు అందకపోవడం విడ్డురంగా ఉందన్నారు. 2019 - 2024 మధ్య ఫసల్ యోజనకు సంబంధించి ప్రభుత్వం నుంచి సహాయక డబ్బులు కట్టకపోవడమే రైతులకు నష్టపరిహారం అందించలేకపోయామన్నారు. యూరియాను రైతులకు సకాలంలో ఇస్తామని.. సూర్యఘర్ పధకం కింద కేంద్రం నుంచి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని 20 సూత్రాల కమిటీ చైర్మన్ లంకా దినకర్ స్పష్టం చేశారు.
వైపీపీపై కేంద్రమంత్రి పెమ్మసాని విమర్శలు
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పధకాల అమలులో గత ప్రభుత్వం తీవ్ర జాప్యం చేసిందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శలు గుప్పించారు. దీనిపై ప్రతి మూడు నెలలలకు ఒకసారి ప్రత్యేక సమీక్షలు చేస్తామని తెలిపారు. జలజీవన్ మిషన్ కింద మ్యాచింగ్ గ్రాంట్స్ గత ప్రభుత్వం ఎవ్వకపోవడం వల్లే చిన్నాభిన్నం జరిగిందన్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రం.. అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. నగర శివారులో ఉన్న గ్రామాల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని కేంద్రమంత్రి పెమ్మసామి చంద్రశేఖర్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
నిధుల మంజూరు, ఇతర పనులపై ఆరోపణలు
Read Latest AP News And Telugu News