YS Jagan: అహంకారమే జగన్‌కు కష్టాలు తెచ్చిపెట్టిందా..
ABN , Publish Date - Sep 14 , 2024 | 11:57 AM
అధికారంలో ఉన్నప్పుడు సీఎం అనే అహంకారంతో జగన్ వ్యవహారించారని సొంత పార్టీ నాయకులే విమర్శించిన సందర్భాలు చూశాం. అధికారంలో ఉన్నప్పుడు తానే రాజునంటూ..
అధికారాన్ని బాధ్యతగా భావిస్తే.. పదవిని చేపట్టిన వ్యక్తికి తగిన గౌరవం దక్కుతుంది. ముఖ్యంగా రాజకీయాల్లో ఈ సూత్రాన్ని తప్పకుండా పాటించాలంటారు. చాలామంది రాజకీయ నాయకులు ఏదైనా పదవి వస్తే గొప్పగా భావించి.. ఇక తమకు తిరుగులేదనే అహంకారాన్ని నింపుకుంటే అప్పటినుంచే ఆ నాయకుడి పతనం ప్రారంభమవుతుందనేది గత అనుభవాలు చూస్తే అర్థమవుతుంది. ఏదైనా పదవిని, అధికారాన్ని బాధ్యతగా స్వీకరిస్తే ఆ వ్యక్తి గౌరవం పెరగడంతో పాటు.. ఆ పదవికి వన్నె తచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఏపీ మాజీ ముఖ్యమంత్రి పరిస్థితి చూస్తుంటే ఆయన అహంకారమే ఆయనకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ప్రతికూల ఫలితాలు రావడంతో ఆ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
జగన్ వైఖరి కారణంగానే ఇలాంటి ఫలితాలు వచ్చాయంటూ బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉన్నప్పుడు సీఎం అనే అహంకారంతో జగన్ వ్యవహారించారని సొంత పార్టీ నాయకులే విమర్శించిన సందర్భాలు చూశాం. అధికారంలో ఉన్నప్పుడు తానే రాజునంటూ ఫీలైన జగన్‌కు అధికారం కోల్పోయాక అసలు విషయం అర్థమైనట్లు ఉంది. ప్రస్తుతం ఆయన నమ్మిన వ్యక్తులే జగన్ తీరు నచ్చక పార్టీని వదిలివెళ్లిపోతున్నారు. మరోవైపు అధికారంలో ఉండి చేసిన అరాచకాలపై ప్రస్తుత ప్రభుత్వం దృష్టి పెట్టడంతో జగన్ ఉక్కిరిబిక్కిరవుతున్నారనే చర్చ జరుగుతోంది.
వరుస కష్టాలు..
సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత జగన్‌కు వరుస కష్టాలు మొదలైనట్లు తెలుస్తోంది. రాష్ట్రప్రజలు జగన్‌ను నమ్మడంలేదని ఫలితాలు స్పష్టం చేయడం జగన్‌ను తీవ్ర నిరాశకు గురిచేసిందట. పార్టీ ప్రారంభం నుంచి జగన్‌తో నడిచిన నాయకులు సైతం అధికారం కోల్పోయిన తర్వాత ఆయనకు గుడ్‌బై చెబుతున్నారు. మరోవైపు వైసీపీ నాయకుల అరాచకాలపై ప్రభుత్వం ఫోకస్ చేయడంతో.. ఆ పార్టీ నాయకులు వరుసగా జైళ్ల పాలవుతున్నారు. దీంతో సగం సమయం పార్టీ నేతల పరామర్శలకే సరిపోతుందట. రాష్ట్రంలో రోజురోజుకు పార్టీ బలహీనపడుతోంది. అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులు వెంటాడుతున్నాయి. తనపై ఉన్న కేసుల్లో కోర్టుకు హాజరవ్వాలంటూ న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. సీఎం పదవిని కోల్పోయిన తర్వాత జగన్ ఒంటరి వాడోయ్యారనే ప్రచారం జరుగుతోంది. అధికారం ఉందనే అహంకారంతో ప్రజలను గౌరవించని కారణంగానే ప్రస్తుతం జగన్‌కు ఈ పరిస్థితి ఎదురైందనే చర్చ జరుగుతోంది.
మారతారా..
జగన్ ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకుంటారా లేదా అనే అనుమానాన్ని సొంత పార్టీ నాయకులేల వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లపాటు ఎవరూ సలహాలు, సూచనలు చేసినా వినని జగన్.. తన పార్టీని నిలబెట్టుకోవడానికి ఇప్పటికైనా అహంకారాన్ని తగ్గించుకుని.. అందరినీ కలుపుకుని ముందుకెళ్తారా.. లేదా పాత పద్ధతినే కొనసాగిస్తారా అనేది భవిష్యత్తుల్లో తెలియనుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Andhra Pradesh News and Latest Telugu News