KC రెడ్డి ఫార్మసీ కాలేజీలో దారుణం..
ABN , Publish Date - Dec 16 , 2024 | 11:42 AM
ఆదివారం సాయంత్రం 3,4 గంటల ప్రాంతంలో బీఫార్మసీ చదువుతున్న రంజిత్ కుమార్ అనే విద్యార్థి వాగు ఊబిలో ఇరుక్కుని మృతి చెందితే కాలేజీ యాజమాన్యం ఇంతవరకు మృత దేహాన్ని బయటకు తీయలేదు. తల్లిదండ్రులు అండగా వచ్చిన ఎమ్మార్పీఎస్ నేతలు కాలేజీ యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుంటూరు జిల్లా: మేడికొండూరు మండలం, జంగంగుంట్లపాలెంలోని కేసీ రెడ్డి ఫార్మసీ కాలేజి (K.C. Reddy Pharmacy College)లో దారుణం (Atrocities) వెలుగుచూసింది. కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంతో వాగు ఊబిలో ఇరుక్కుపోయి విద్యార్థి మృతి (Student death) చెందాడు. మోటార్ మరమ్మత్తు కోసం కాలేజి యాజమాన్యం విద్యార్దులను వాగులోకి దింపింది. అయితే వాగు ఊబిలో ఇరుక్కుని మూల్పూరు రంజిత్ కుమార్ అనే విద్యార్థి మృతి చెందాడు. నిన్న (ఆదివారం) సాయంత్రం ఊబిలో ఇరుక్కుపోయిన విద్యార్థి మృతి చెందినట్లుగా సమాచారం. అయితే మృత దేహాన్ని కాలేజీ యాజమాన్యం బయటకు తీయకపోవడంపై విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు కాలేజి వద్దకు చేరుకుంటున్నారు.
ఆదివారం సాయంత్రం 3,4 గంటల ప్రాంతంలో బీఫార్మసీ చదువుతున్న రంజిత్ కుమార్ అనే విద్యార్థి వాగు ఊబిలో ఇరుక్కుని మృతి చెందితే కాలేజీ యాజమాన్యం ఇంతవరకు మృత దేహాన్ని బయటకు తీయలేదు. దీంతో తల్లిదండ్రులకు అండగా వచ్చిన ఎమ్మార్పీఎస్ నేతలు కాలేజీ యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న సాయంత్రం విద్యార్థి చనిపోతే మృత దేహాన్ని ఇంత వరకు ఎందుకు తీయలేదని ప్రశ్నించారు. మోటార్ మరమ్మత్తు కోసం మెకానిక్‌ను పిలిపించుకుని పని చేయంచకోవాలని.. విద్యార్థులను వాగులోకి దింపడం సరికాడని అన్నారు. విద్యార్థి మృతిపై కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ నేతలు ఆందోళన చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ నిర్వాకం.. రైతుల కష్టాలు..
ABN Live..: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..
తిరుమల శ్రీవారి దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం..
జాకీర్ హుస్సేన్ మృతిపై చంద్రబాబు, లోకేష్ సంతాపం..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News