AP News: గుంటూరులో వైసీపీ కీలక నేతపై కేసు
ABN , Publish Date - Dec 19 , 2024 | 11:10 AM
Andhrapradesh: వైఎస్సార్సీపీ కీలక నేతలపై గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. రెండు రోజుల క్రితం పట్టాభిపురం పోలీస్‌స్టేషన్ వద్ద అంబటి రాంబాబు, వైసీపీ నేతలు నిరసన చేపట్టారు. ఇటీవల కాలంలో వైసీపీ సోషల్ మీడియా సైకోలను అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో వైసీపీపై పోస్టులు పెట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేయాలంటూ అంబటి,
గుంటూరు, డిసెంబర్ 19: జిల్లాలో వైసీపీ కీలక నేతపై కేసు నమోదు అయ్యింది. గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీస్‌స్టేషన్‌లో వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై (Former Minister Ambati Rambabu) పోలీసులు కేసు నమోదు చేశారు. అంబటితో పాటు పలువురు వైసీపీ నేతలపైనా కేసు నమోదు అయ్యింది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ అంబటి, వైసీపీ నేతలపై కేసు ఫైల్ అయ్యింది.
Viral Video: ఫోన్ పిచ్చిలో పడితే ఇలాగే జరుగుతుంది.. వంట చేస్తూ ఫోన్ చూస్తుండగా.. సడన్‌గా..
రెండు రోజుల క్రితం పట్టాభిపురం పోలీస్‌స్టేషన్ వద్ద అంబటి రాంబాబు, వైసీపీ నేతలు నిరసన చేపట్టారు. ఇటీవల కాలంలో వైసీపీ సోషల్ మీడియా సైకోలను అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో వైసీపీపై పోస్టులు పెట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేయాలంటూ అంబటి, పలువురు వైసీపీ నేతలు కలిసి గుంటూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు ఇచ్చారు. అయితే తామిచ్చిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేయడం లేదంటూ అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల చర్యలకు నిరసనగా రెండు రోజులు వైసీపీ నేతలతో కలిసి అంబటి రాంబాబు పట్టాభిపురం పోలీస్‌స్టేషన్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు.
అయితే అదే రోజు మంగళగిరి ఎయిమ్స్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కార్యక్రమంలో పోలీసులు విధులు నిర్వహిస్తున్నామని.. తర్వాతి రోజు రావాలంటూ వైసీపీ నేతలకు పోలీసులు అధికారులు చెప్పారు. అయినప్పటికీ పోలీసుల మాటలను పట్టించుకోకుండా అంబటి రాంబాబు పోలీస్‌స్టేషన్ వద్ద బైఠాయించి ప్లకార్డులు పట్టుకుని నిరసన చేశారు. ఈ నేపథ్యంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అమిత్ షాపై హీరో విజయ్ సంచలన వ్యాఖ్యలు
అయితే ఈ వ్యవహారంపై అంబటి రాంబాబుకు పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అంబటి గుంటూరులోని ఆయన నివాసంలో ఉన్నారు. గత రాత్రి ఆయన కేసు నమోదు చేసిన నేపథ్యంలో అంబటికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలువనున్నట్లు సమాచారం. అయితే అంబటికి పోలీసులు ఎప్పుడు నోటీసులు ఇస్తారనదానిపై స్పష్టత లేదు.
ఇవి కూడా చదవండి...
Hyderabad: భర్త మోసం చేశాడని భార్యకు వేధింపులు
వాహనదారులకు షాక్.. హైకోర్టు సంచలన ఆదేశాలు..
Read Latest AP News And Telugu News