CM Chandrababu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సీఎం చంద్రబాబు సన్మానం
ABN , Publish Date - Dec 17 , 2024 | 01:39 PM
గుంటూరు జిల్లా: మంగళగిరి ఎయిమ్స్‌లో జరిగిన తొలి స్నాతకోత్సవ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్రపతికి శాలువ కప్పి సన్మానించారు. అలాగే తిరుమల శ్రీవారి మెమొంటోను బహుకరించారు.
గుంటూరు జిల్లా: మంగళగిరి ఎయిమ్స్ (AIIMS)లో జరిగిన తొలి స్నాతకోత్సవ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (CM Nara Chandrababu Naidu) రాష్ట్రపతికి శాలువ కప్పి సన్మానించారు. అలాగే తిరుమల శ్రీవారి మెమొంటోను బహుకరించారు. తర్వాత జరిగిన కార్యక్రమంలో 49 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు రాష్ట్రపతి పట్టాలు అందజేశారు. మెరిట్ సాధించిన నలుగురు విద్యార్థులకు బంగారు పతకాలు బహూకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతితో పాటు రాష్ట్ర గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు ఆయూష్, ప్రకాష్ రావు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్ , సత్య కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్ధులు ద్రౌపది ముర్మును ఆదర్శంగా తీసుకోవాలి..
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్మును ఒక ఆదర్శంగా విద్యార్ధులు తీసుకోవాలన్నారు. ఒక ఆదివాసి కుటుంబం నుంచి వచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవడం ఆవిడ సాధించిన విజయమని పేర్కొన్నారు. కష్టపడితే ఈ ప్రపంచంలో సాధించలేనిది లేదనడానికి ద్రౌపది ముర్ము జీవితం ఒక ఉదాహరణగా పేర్కొన్నారు. దేశంలో ఏ AIIMS కు కూడా ఇలాంటి భూమి లేదని.. అమరావతి భారతదేశపు భవిష్యత్ సిటీ అని.. మంగళగిరి ఎయిమ్స్ భారతదేశంలోనే నంబర్ 1 అవుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
960 బెడ్లు ఉన్న ఆసుపత్రి... రూ. 1618 కోట్లు ఖర్చుతో సిద్ధమైన ఆసుపత్రి.. మంగళగిరి ఎయిమ్స్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. డాక్టర్లుగా ఎదగడానికి టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉండాలని డైరెక్టర్ మధవానంద కర్ అంటున్నారని, ఎయిమ్స్ మంగళగిరికి 10 ఎకరాలు ఇస్తామని, అవకాశం ఉంటే తనకు ఇక్కడ చదువుకోవాలని ఉందన్నారు. భవిష్యత్తులో ఎయిమ్స్ మంగళగిరికి ఎలాంటి మౌళిక సదుపాయాల లోటు ఉండనివ్వమని సీఎం స్పష్టం చేశారు. కొలనుకొండలో రీసెర్చ్ సెంటర్, ఐఐటీతో అనుసంధానించాలనుకుంటున్నామన్నారు. మెడికల్ అనేది ఇప్పుడు మెడ్ టెక్‌గా మారిపోయిందని, డీప్ టెక్‌ను మెడికల్‌లో కూడా అమలు చేయాలనుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేటీఆర్ చేసిన తప్పుకు బెయిల్ కూడా రాదు..
విజయసాయి రెడ్డి నా భార్యను లోబర్చుకొని..: మదన్ మోహన్
అమృతసర్ పోలీస్ స్టేషన్ వద్ద పేలుడు..
తిరుమల లడ్డూ కల్తీలో మరో ట్విస్టు..
ఢిల్లీలో మరోసారి గ్రాఫ్ 4 పై ఆంక్షలు..
అధికారులకు సంబంధం లేదు.. పూర్తి బాధ్యత నాదే: కేటీఆర్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News