Anitha: అలాంటి వారిపై ప్రత్యేక చట్టం: హోం మంత్రి అనిత
ABN , Publish Date - Nov 07 , 2024 | 09:26 PM
రవీంద్ర రెడ్డి గురించి అనిత ప్రస్తావించారు. రవీంద్ర రెడ్డి తప్పు చేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కానీ రవీంద్ర రెడ్డిని కాపాడేందుకు జగన్ అండ్ కో ప్రయత్నిస్తోంది. లీగల్ టీమ్‌తో జగన్ వార్ రూమ్ మెయింటెన్ చేస్తున్నాడు. రవీంద్ర రెడ్డి ఎవరో కాదు జగన్ సతీమణీ భారతీ పీఏ అని తెలుస్తోంది అని చెప్పుకొచ్చారు.
అమరావతి: సోషల్ మీడియా పోస్టుల అంశం ఆంధ్రప్రదేశ్‌లో కాక రేపుతోంది. పోస్టులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్య నేతల పేర్లతో ఫేక్ అకౌంట్లు ఓపెన్ చేయడం, వారి పేర్లతో పోస్టులు చేసే అంశాన్ని సర్కార్ సీరియస్‌గా తీసుకుంది. అందుకోసం ప్రత్యేక చట్టం తీసుకొచ్చేందుకు వెనకాడబోమని స్పష్టం చేసింది.
కొందరు నీచులు..
ఫేక్ అకౌంట్ల అంశం గురించి హోం మంత్రి అనిత మాట్లాడారు. ‘కొందరు నీచులు నా పేరుతో ఫేక్ అకౌంట్ ఓపెన్ చేశారు. ఆ ఖాతా ద్వారా జనసేనకు వ్యతిరేకంగా పోస్టులు చేశారు. దీంతో జనసేన పార్టీ, ఆ పార్టీ నేతలు నేను పోస్ట్ చేశానని భావించారు. ఆ అకౌంట్ తనది కాదని, ఫేక్ అకౌంట్ అని చెప్పాల్సి వచ్చింది. అంతేకాదు మహిళల లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. ఆడవారిని లక్ష్యంగా చేసుకునే వారిపై ఉపేక్షించం. ఇందుకు సంబంధించి కఠిన చట్టం తీసుకొస్తాం. ఇదే అంశం గురించి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో చర్చించా. తల్లి, చెల్లిపై అసభ్యకరంగా మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తోంది అని’ హోం మంత్రి అనిత చెప్పుకొచ్చారు.
తప్పు చేయడంతో అరెస్ట్
రవీంద్ర రెడ్డి గురించి అనిత ప్రస్తావించారు. రవీంద్ర రెడ్డి తప్పు చేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కానీ రవీంద్ర రెడ్డిని కాపాడేందుకు జగన్ అండ్ కో ప్రయత్నిస్తోంది. లీగల్ టీమ్‌తో జగన్ వార్ రూమ్ మెయింటెన్ చేస్తున్నాడు. రవీంద్ర రెడ్డి ఎవరో కాదు జగన్ సతీమణీ భారతీ పీఏ అని తెలుస్తోంది అని చెప్పుకొచ్చారు. భావ ప్రకటన స్వేచ్చకు ఒక లిమిట్ ఉంటుంది. కొందరు సోషల్ మీడియా ముసుగులో ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఇది ఎంత మాత్రం సమంజసం కాదని అనిత హితవు పలికారు. తప్పు చేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి...
AP News: ఎమ్మెల్యే మాధవి ఇష్యూ.. కడప మేయర్ ఏం చెప్పారంటే
Vasanthakrishna: త్వరలో నీకు సినిమా పక్కా.. జోగికి మైలవరం ఎమ్మెల్యే వార్నింగ
For AndhraPradesh News And Telugu News..