Share News

Pawan Kalyan Birthday Special: అపజయాలను విజయాలుగా మల్చుకున్న రియల్ లీడర్..

ABN , Publish Date - Sep 01 , 2024 | 07:04 PM

తన ప్రజల కోసం ఏదైనా చేయాలనే తపన.. అధికారం ఉన్నా.. లేకపోయినా ఒకటే మనస్థత్వం. పేదవాడి బతుకు బాగుండాలనే ఆలోచన ఒక్కటే పవన్ మదిలో మెదులుతూ ఉంటుంది. సినిమాల్లో అయినా.. రాజకీయాల్లో అయినా..

Pawan Kalyan Birthday Special: అపజయాలను విజయాలుగా మల్చుకున్న  రియల్ లీడర్..
Pawan Kalyan

సెప్టెంబర్ 2 అంటే వెంటనే గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. జీవితంలో ఎన్నో కష్ట, నష్టాలను ఎదురొడ్డి.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న వ్యక్తి జనసేనాని. ఎన్నో ఓటములు ఎదురైనా.. విజయం కోసం ముందుకు సాగి.. ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న నాయకుల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. ప్రజాసేవకు అంకితమవ్వాలనే లక్ష్యంతో జనసేన పార్టీని స్థాపించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీతో కలిసి పోటీచేసిన జనసేన వంద శాతం స్ట్రైక్ రేట్‌తో విజయం సాధించింది. ఈ విజయం వెనుక పవన్ కళ్యాణ్ కఠోర శ్రమ దాగి ఉంది. సోమవారం పవన్ కళ్యాణ్ 55 సంవత్సరాలు పూర్తిచేసుకుని 56వ పడిలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇప్పటివరకు ఓ సినీస్టార్‌గా పవన్ జరుపుకున్న పుట్టినరోజులు ఒక ఎత్తైతే.. ఈ పుట్టినరోజు ఆయనకే కాదు.. పవన్ అభిమానులకు ఎంతో ప్రత్యేకం. ఓ సక్సెస్‌ఫుల్ రాజకీయనాయకుడిగా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ 56వ పుట్టినరోజును గ్రాండ్‌గా జరుపుకునేందుకు ఆయన అభిమానులు రెడీ అయ్యారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా తన సినీ, రాజకీయ జీవితంపై ప్రత్యేక కథనం..

AP Rains: ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లు రద్దు.. వివరాలివే..


గుండె ధైర్యం..

పవన్ కళ్యాణ్ అంటే ఆయనను నమ్ముకున్న అభిమానులకు గుండె ధైర్యం.. ప్రశ్నించే గొంతుక.. అక్రమార్కుల గుండెల్లో దడ.. సామాన్యుడి కోసం ఎంతవరకైనా తెగించే తత్వం. ఓటములకు కుంగిపోయి.. విజయాలకు పొంగిపోయే వ్యక్తిత్వం కాదు. సమాజం కోసం నిరంతర ఆలోచన.. తన ప్రజల కోసం ఏదైనా చేయాలనే తపన.. అధికారం ఉన్నా.. లేకపోయినా ఒకటే మనస్థత్వం. పేదవాడి బతుకు బాగుండాలనే ఆలోచన ఒక్కటే పవన్ మదిలో మెదులుతూ ఉంటుంది. సినిమాల్లో అయినా.. రాజకీయాల్లో అయినా పవన్ కళ్యాణ్‌ది ప్రత్యేక స్థానం. చిన్నతనం నుంచి ఎన్నో కష్ట, నష్టాలను చూశారు. తన ఎదుగుదలలో ఎన్నో అపజయాలు పలకరించాయి.. అయినా సరే నిరుత్సాహపడలేదు. పరాజయాలను అనుభవ పాఠాలుగా మల్చుకుని ముందుకు సాగారు.. ఈ ప్రయాణంలో ఎన్నో వెక్కిరింతలు.. మరెన్నో అవమానాలు.. వాటన్నింటిని ఎంతో సహనంగా భరించారు.. ప్రజల కోసం ఒకరోజు వస్తుందనే ఆశాభావంతో ముందుకు కదిలారు. 2024 సార్వత్రిక ఎన్నికల రూపంలో ఆ సమయం వచ్చింది. ఎవరూ ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన వంద శాతం స్ట్రైక్ రేటు సాధించింది. కొన్ని దశాబ్ధాలుగా పవన్‌ కళ్యాణ్‌ను హేళన చేసిన వ్యక్తులే శభాష్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు.

CM Chandrabab: గుడ్లవల్లేరు ఘటనపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు


సామాన్యుడి కోసం..

అధికారంలో ఉన్నామని అహంకారం లేదు. పదవి ఉందని పొగరు లేదు. ప్రజలు ఇచ్చిన అధికారంతో సామాన్యుడి జీవితాల్లో వెలుగులు నింపాలనే సంకల్పమే పవన్ ముందు కనిపిస్తోంది. రెండు నెలల కాలంలోనే గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖలో సంస్కరణలకు శ్రీకారం చుట్టి.. ప్రజల మనన్నలు పొందుతున్న నిజమైన ప్రజా నాయకుడు పవన్ కళ్యాణ్.. ప్రజలే అతడి సైన్యం. ప్రజలకు ఇచ్చిన మాట కోసం నిలబడే వ్యక్తిత్వం. సమస్య ఉందన్న అంటే నీకు నేను తోడుగా ఉంటానంటూ.. సమస్య నుంచి విముక్తిడిని చేసే వరకు విశ్రమించని నాయకుడు పవన్ కళ్యాణ్.

AP Politics: పేర్ని నానికి గుడివాడలో ఘోర అవమానం.. దెబ్బకు బండి తిప్పుకుని..


రాజకీయాల్లో..

సినిమాల్లోనే కాదు.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ పవన్ కళ్యాణ్ అంటే ఓ బ్రాండ్.. ప్రజల నుంచి పైసా ఆశించని నాయకుడు. తన సంపాదనను ప్రజల కోసం పెట్టే ప్రజా నాయకుడు పవన్ కళ్యాణ్. ఐదేళ్ల క్రితం పోటీచేసిన రెండు స్థానాల్లో ఓడిపోయినా నిరాశపడలేదు. రాజకీయాలకు పనికిరావంటే వెనకడుగు వేయలేదు. ప్రజల కోసం ప్రశ్నించే గొంతుకనంటూ ముందడుగు వేశారు. ఐదేళ్లు తిరిగేసరికి.. తాను నమ్మిన ప్రజలే ఘన విజయాన్ని అందించారు. దేశ రాజకీయాల్లో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నారు పవన్ కళ్యాణ్. దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేకంగా అభిమానించే వ్యక్తుల్లో పవన్ ఒకరు. ఆయన నీతి, నిజాయితీ, పట్టుదల, సంకల్ప బలం.. ఇవ్వన్నీ కలగలిపి పవన్ కళ్యాణ్‌ను సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లోనూ రియల్ హీరోను చేశాయి.

CM Chandrababu: 50 ఏళ్లలో ఎప్పుడూ పడనంతగా వర్షం.. సీఎం చంద్రబాబు సమీక్ష


ప్రతి పనిలో ప్రజాకోణం..

పవన్ కళ్యాణ్ ఏ పని చేసినా ప్రజాకోణం ప్రతిబింబిస్తుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఏం చేయాలో నిరంతరం ఆలోచించే ఆధునిక రాజకీయ నాయకుడు జనసేనాని. ప్రజల సమస్యలను పార్టీ అజెండాగా మార్చుకున్న నాయకుడు. ప్రభుత్వం అంటే అధికారాన్ని చలాయించడం కాదు.. ప్రజలకు జవాబుదారీలా ఉండే వ్యవస్థ అని చెప్పడంతో పాటు.. చేతల్లో చూపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్. సమస్యలను ప్రస్తావించడం కాదు.. సమస్యకు పరిష్కారం చూపించేవరకు నిద్రపోని వ్యక్తి పవన్. ఉద్దానం సమస్య ఉందని చెప్పి ఊరుకోలేదు. ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేసిన నిజమైన నాయకుడు పవన్. అంతర్జాతీయ స్థాయి వైద్యబృందాన్ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చి, ఇక్కడి సమస్యలపై అధ్యయనం చేయించి.. ప్రభుత్వాన్ని కదిలించిన నాయకుడు పవన్ కళ్యాణ్. రాజకీయ కక్షతో ఇప్పటం ప్రజల ఇళ్లను జగన్ ప్రభుత్వం కూలిస్తే వారికి అండగా ఉంటానంటూ.. కుటుంబానికి లక్ష రూపాయిల ఆర్థిక సాయం అందించి మానవత్వాన్ని చాటుకున్న పొలిటీషియన్ పవన్ కళ్యాణ్. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు తన సొంత డబ్బులతో ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయిల ఆర్థిక సాయం అందించిన నేత జనసేనాని. అందుకే పవన్ ఏమి చేసినా వెరీ స్పెషల్. నేటి రాజకీయ నాయకులకు ఆదర్శప్రాయుడు జనసేనాని.


CM Chandrababu: ఏపీలో భారీ వర్షాలు.. రేపు స్కూళ్లకు సెలవు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Sep 01 , 2024 | 08:02 PM