Share News

Pawan Kalyan: జూన్ 20తర్వాత పిఠాపురం వస్తా: పవన్ కల్యాణ్

ABN , Publish Date - Jun 13 , 2024 | 07:43 PM

పిఠాపురం నియోజకవర్గ (Pithapuram Constituency) ప్రజల్ని ఈనెల 20వ తేదీ తర్వాత కలవనున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Pawan Kalyan: జూన్ 20తర్వాత పిఠాపురం వస్తా: పవన్ కల్యాణ్
Janasena chief Pawan Kalyan

అమరావతి: పిఠాపురం నియోజకవర్గ(Pithapuram Constituency) ప్రజల్ని ఈనెల 20వ తేదీ తర్వాత కలవనున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే జిల్లాలవారీగా పర్యటించనున్నట్లు చెప్పారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దేశ నలుమూలల నుంచీ అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.

CM Chandrababu: సీఎం చంద్రబాబుకు బ్రహ్మరథం పట్టిన అమరావతి రైతులు..


పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.."ప్రజాసంఘాల నాయకులు, మేధావులు, నిపుణులు, సినీరంగ ప్రముఖులు, యువత, రైతులు, ఉద్యోగ వర్గాలు, మహిళలు అభినందనలు తెలుపుతున్నారు. వంద శాతం గెలుపు సాధించడంతో పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులు ఆనందంతో వేడుకలు చేసుకుంటున్నారు. నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేరుగా కలిసి అభినందించాలని నాయకులు, కార్యకర్తలు ఆశిస్తున్నారు. త్వరలోనే వారందరినీ జిల్లాలవారీగా కలసి మాట్లాడాలని నిర్ణయించుకున్నా. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను పార్టీ కేంద్ర కార్యాలయం ద్వారా తెలియజేస్తా. నన్ను కలిసేందుకు వచ్చే వారు పూల బొకేలు, శాలువాలు తీసుకురావద్దు. ఈనెల 20వ తేదీ తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తాను. ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. అదే విధంగా శాసనసభ సమావేశాలూ త్వరలోనే ఉంటాయి. వీటిని పూర్తి చేసుకుని నన్ను అఖండ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం ప్రజల్ని కలుస్తా. దశలవారీగా అన్ని గ్రామాల్లో పర్యటిస్తా" అని తెలిపారు.

ఇది కూడా చదవండి:

AP Politics: చిత్తుచిత్తుగా ఎందుకు ఓడిపోయారో ఆత్మ పరిశీలన చేసుకోండి: ఎమ్మెల్సీ అనురాధ

Updated Date - Jun 13 , 2024 | 08:06 PM