Share News

AP News: ప్రమాదంలో 150 గొర్రెలు మృతి.. గొర్రెల కాపరి పరిస్థితి విషమం..

ABN , Publish Date - Dec 22 , 2024 | 11:13 AM

పల్నాడు జిల్లా, దాచేపల్లి సమీపంలో ఆదివారం తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి గుంటూరు వస్తు్న్న శ్రీ మారుతీ ట్రావెల్స్ బస్సు గొర్రెల మందవైపు దూసుకు వెళ్లింది. 4 వందల గొర్రెలతో వెళుతున్న మందపైకి బస్సు దూసుకుపోయింది.

AP News: ప్రమాదంలో 150 గొర్రెలు మృతి.. గొర్రెల కాపరి పరిస్థితి విషమం..

పల్నాడు జిల్లా: దాచేపల్లి వద్ద ఘోర ప్రమాదం (Road Accident) జరిగింది. పులిపాడు నుంచి దాచెపల్లి వైవు వెళుతున్న గుర్రెల మందను (Sheeps) హైదరాబాద్ (Hyderabad) నుంచి గుంటూరు వెళుతున్న ట్రావెల్స్ బస్సు (Travels Bus) ఢీ కొట్టింది. ఈ ఘటనలో 150 గొర్రెలు అక్కడిక్కడే మృతి చెందాయి. గొర్రెల మందకు కాపలా ఉన్న వ్యక్తిని కూడా ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గొర్రెల కాపరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న దాచేపల్లి పోలీసులు సంఘటన పధేశానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జరిగిన ప్రమాదంపై దాచేపల్లి పోలీసులు కేసు నమోదు చేపుకుని దర్యాప్తు చేపట్టారు.

పల్నాడు జిల్లా, దాచేపల్లి సమీపంలో ఆదివారం తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి గుంటూరు వస్తు్న్న శ్రీ మారుతీ ట్రావెల్స్ బస్సు గొర్రెల మందవైపు దూసుకు వెళ్లింది. 4 వందల గొర్రెలతో వెళుతున్న మందపైకి బస్సు దూసుకుపోయింది. విషయం తెలుసుకున్న స్థానికులు, గొర్రెల కాపరి కుటుంబ సభ్యులు సంఘటన ప్రదేశానికి చేరుకుని తమకు న్యాయం చేయాలని దాచేపల్లి సెంటర్‌లో రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ప్రస్తుతం అద్దంకి, నార్కెట్ పల్లి హైవేపై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.


దీంతో పల్నాడు జిల్లా ఎస్‌పి శ్రీనివాస్ సంఘటన ప్రదేశానికి చేరుకుని.. బాధితులతో మాట్లాడినప్పటికీ కూడా వారు ఆందోళన విరమించలేదు. కాగా ప్రమాదం చేసిన ట్రావెల్స్ డ్రైవర్ బస్సును సంఘటన ప్రదేశంలో వదిలేసి పారిపోయాడు. దీంతో పోలీసులు ట్రావెల్స్ యాజమాన్యంతో సంప్రదింపులు జరుపుతున్నారు. తమకు న్యాయం చేసే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదని గొర్రెల కాపరులు, బాధితుడి కుటుంబసభ్యులు ఆందోళన కొనగిస్తున్నారు. ఈ క్రమంలో అద్దంకి, నార్కెట్ పల్లి వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రమాదం ఆయన ప్రేరేపించింది కాదు: పురందేశ్వరి

కుప్పంలో నాల్గవ రోజు నారా భువనేశ్వరి పర్యటన

కాలినడకన ఇంద్రకీలాద్రికి తరలివస్తున్న భవానీలు...

హై స్పీడ్‌లో అమరావతి పనులు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 22 , 2024 | 11:13 AM