YSRCP: అనాధ ఆశ్రమం కబ్జాకు వైఎస్ఆర్‌సీపీ ప్రయత్నం
ABN , Publish Date - Dec 20 , 2024 | 01:52 PM
గుంటూరు జిల్లా: అధికారంలో లేకపోయినా రాష్ట్రంలో వైఎస్ఆర్‌సీపీ నేతలు కొందరు అక్కడక్కడ దౌర్జన్యాలకు పాల్పడుతునే ఉన్నారు. వైఎస్ఆర్‌సీపీ నేత ఆరిక శ్రీనివాస్ అర్ధరాత్రి బాల వికాస కేంద్రంలో చర్చి కూల్చివేశాడు. ప్రోక్లైనర్‌తో భవనాలు కూల్చివేసే ప్రయత్నం చేశాడు. అడ్డుకున్న స్థానికులపై తన రౌడీలతో దాడికి యత్నించాడు.
గుంటూరు జిల్లా: అధికారంలో లేకపోయినా రాష్ట్రంలో వైఎస్ఆర్‌సీపీ నేతలు (YSRCP Leaders) కొందరు అక్కడక్కడ దౌర్జన్యాలకు పాల్పడుతునే ఉన్నారు. తాజాగా ఓ అనాధ ఆశ్రమం కబ్జాకు వైఎస్ఆర్‌సీపీ నేత తన అనుచులతో ప్రయత్నించాడు. గుంటూరు జిల్లా (Guntur Dist.), రెడ్డి పాలెం సమీపంలోని బాల వికాస కేంద్రం కబ్దాకు యత్నించారు. వైఎస్ఆర్‌సీపీ నేత ఆరిక శ్రీనివాస్ రెడ్డి (Arika Srinivas Reddy) తన రౌడీలతో గురువారం అర్దరాత్రి వచ్చి హంగమా సృష్టించాడు. అర్ధరాత్రి బాల వికాస కేంద్రంలో చర్చి కూల్చివేశాడు. ప్రోక్లైనర్‌తో భవనాలు కూల్చివేసే ప్రయత్నం చేశాడు. దీంతో స్థానికులు అడ్డుకున్నారు. తన రౌడీలతో స్దానికులపై దాడికి ప్రయత్నించాడు. కాగా చర్చి పూర్వ విద్యార్ధుల ఆధ్వర్యంలో నడుస్తోంది. 50 ఏళ్ల నుంచి బాల వికాస కేంద్రం నడుస్తోంది. దివిసీమ ఉప్పెనలోని అనాధ పిల్లలతో ఆశ్రమం ప్రారంభమైంది వాటిపై కన్నేసిన ఆరిక శ్రీనివాస్ రెడ్డి కబ్జాకు యత్నించాడు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎడ్యుకేషనల్ హబ్‌గా కుప్పం: నారా భువనేశ్వరి
ఫార్ములా ఈ కార్ రేస్‌పై చర్చకు బీఆర్ఎస్ డిమాండ్..
ప్రభుత్వానికి వ్యతిరేకంగా లగచర్ల రైతుల నినాదాలు..
కుప్పంలో రెండో రోజు నారా భువనేశ్వరి పర్యటన..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News