Share News

Sajjala Ramakrishna Reddy: ఫోన్ ఇవ్వలేదు.. విచారణకు సహకరించడం లేదు..

ABN , Publish Date - Oct 17 , 2024 | 06:16 PM

టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో ఏ120గా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డిని విచారించామన్నారు. గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారని తెలిపారు. తమవద్ద ఉన్న ఆధారాలతో సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రశ్నించామని చెప్పారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ అడిగామని, ఆయన ఇవ్వలేదని, విచారణకు సహకరించలేదని..

Sajjala Ramakrishna Reddy: ఫోన్ ఇవ్వలేదు.. విచారణకు సహకరించడం లేదు..
Sajjala Ramakrishna Reddy

మంగళగిరిలో టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని పోలీసులు విచారించారు. ఆయన పాత్రపై ఆధారాలు లభించడంతో ఆయనను ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. దర్యాప్తునకు రావాలని పోలీసులు నోటీసులు జారీచేయడంతో ఆయన గురువారం మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు హాజరయ్యారు. విచారణ తర్వాత మంగళగిరి రూరల్ సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో ఏ120గా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డిని విచారించామన్నారు. గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారని తెలిపారు. తమవద్ద ఉన్న ఆధారాలతో సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రశ్నించామని చెప్పారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ అడిగామని, ఆయన ఇవ్వలేదని, విచారణకు సహకరించలేదని తెలిపారు. తమ ప్రశ్నలకు వ్యతిరేక ధోరణిలో సమాధానాలు చెప్పారన్నారు. ఘటన జరిగిన రోజు తాను ఇక్కడ లేనని మాత్రమే చెప్పారన్నారు. ఈ కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఉన్నట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. గత మూడు నెలలుగా ఈ కేసును విచారిస్తున్నామని సీఐ తెలిపారు. కేసు దర్యాప్తు చివరకు వచ్చిందని, నిందితులు చాలా మంది కోర్టుల ద్వారా రక్షణ పొందారన్నారు. దీంతో కేసు దర్యాప్తు వేగంగా జరగటంలేదన్నారు. నిందితులను అరెస్ట్ చేస్తే విచారణ త్వరగా పూర్తవుతుందన్నారు. ఈ కేసు విచారణను ప్రభుత్వం సిఐడికి అప్పగించిందని, ఉత్తర్వులు రాగానే విచారణ ఫైళ్లు సిఐడి అధికారులకు అప్పగిస్తామన్నారు.


అన్నింటికి అదే సమాధానం..

సజ్జల రామకృష్ణారెడ్డిని అడిగేందుకు ముందుగా సిద్ధంచేసుకున్న 38 ప్రశ్నలను అడిగామని సీఐ శ్రీనివాసరావు తెలిపారు. చాలా ప్రశ్నలకు గుర్తులేదనే సమాధానం చెప్పారన్నారు. విచారణకు సజ్జల రామకృష్ణారెడ్డి సహకరించడంలేదన్నారు. తమ విచారణలో సజ్జల ప్రమేయంపై అనేక ఆధారాలు లభించాయన్నారు. ఆధారాలు ముందుంచి సజ్జల రామకృష్ణారెడ్డిని విచారించినట్లు తెలుస్తోంది.


తనకు సంబంధం లేదంటూ..

ఓవైపు పోలీసుల విచారణకు సహకరిస్తామంటూనే వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పోలీసుల దర్యాప్తులో నోరు మెదపడంలేనట్లు తెలుస్తోంది. దాడి జరిగిన రోజు తాను దూరంగా ఉన్నానని చెబుతూ కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి. వాస్తవానికి దాడి జరిగిన రోజు సజ్జల స్థానికంగా అందుబాటులో లేకపోయినా.. ఆయన డైరెక్షన్‌లోనే టీడీపీ కార్యాలయంపై దాడికి కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఆయన ఆదేశాలతోనే పక్కా ప్లాన్ చేశారనే ఆరోపణలు వినిపించాయి. పోలీసుల విచారణలో లభించిన ఆధారాలతో సజ్జలను ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. సజ్జలను అరెస్ట్ చేయవద్దంటూ కోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో ఆయనను నోటీసులు ఇచ్చి విచారించారు. ఈనెల 24వ తేదీ వరకు సజ్జలపై చర్యలు తీసుకోవద్దని కోర్టు సూచించింది. అదే సమయంలో విచారణకు పూర్తిస్థాయిలో సహకరించాలని ఆదేశించింది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Oct 17 , 2024 | 06:16 PM