Chavithi festival : చవితి ఉత్సవాలను ప్రశాంతంగా చేసుకోండి
ABN , Publish Date - Sep 06 , 2024 | 11:30 PM
గణే శ ఉత్సవాలను ప్రశాంత వాతా వరణంలో చేసుకోవా లని లక్కి రెడ్డిపల్లె సీఐ ఉత్సవ కమిటీ నిర్వాహకులకు సూచించారు.
రామాపురం, సెప్టెంబరు6: గణే శ ఉత్సవాలను ప్రశాంత వాతా వరణంలో చేసుకోవా లని లక్కి రెడ్డిపల్లె సీఐ ఉత్సవ కమిటీ నిర్వాహకులకు సూచించారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో పీస్ కమిటీ నిర్వాహకులతో పండుగ నిర్వహణ అంశంపై నిర్వహిం చిన సమావేశంలో ఆయన మా ట్లాడుతూ పండుగ భక్తిపూర్వక ప్రశాంత వాతావరణంలో నిర్వ హించుకోవాలని సూచించారు. రోజువారి ప్రతిమల వద్ద భక్తి పూర్వకంగా భజనలు చేసుకోవాలన్నారు. అశ్లీల, రికార్డు డ్యాన్సులు లాంటివి ఉండ కూడదన్నారు. నిలువెత్తు ప్రతిమలను నిమజ్జనం రోజున ఊరేగింపు వంటి విష యాల్లో పోలీసుల సూచనలు విధిగా పా టించాలన్నారు. నిర్వాహకులు, గ్రామాల ప్రజలు తమవంతుగా ఈ వేడుకలకు సం బంధించి పోలీసులకు సహకరించాల న్నారు. పలు గ్రామాల ప్రజలు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
వీరబల్లిలో...
వీరబల్లి, సెప్టెంబరు6: ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావర ణంలో వినాయక చవితి పండుగ ను చేసుకోవాలని ఎస్‌ఐ మోహన్ నాయక్ సూచించారు. పీస్ కమి టీ సమావేశంలో వినాయక మం డపాల వద్ద చిన్న సౌండ్ బాక్సు లు మాత్రమే ఉప యోగించాల న్నారు. నిమజ్జనం రోజు చిన్నపి ల్లలను, మందు తాగిన వారిని నిమజ్జనానికి దూరంగా ఉంచాల న్నారు. సాయంత్రం 7 గంటలోపు నిమజ్జనం పూర్తి చేయాలన్నారు. తాగి నిమజ్జనంలో పాల్గొన కూడదని హెచ్చరించారు. కార్యక్ర మంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.