Share News

Coastal Areas : మళ్లీ భారీ వర్ష సూచన

ABN , Publish Date - Dec 16 , 2024 | 05:07 AM

దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఆ తరువాత రెండు రోజుల్లో పశ్చిమ వాయవ్యంగా పయనించి మరింత బలపడే క్రమంలో తమిళనాడు తీరం దిశగా రానుందని వాతావరణ శాఖ తెలిపింది.

Coastal Areas  : మళ్లీ భారీ వర్ష సూచన

  • రేపటి నుంచి మూడు రోజులు పలు జిల్లాల్లో..

  • నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం

  • రైతులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచన

విశాఖపట్నం, పాడేరు, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఆ తరువాత రెండు రోజుల్లో పశ్చిమ వాయవ్యంగా పయనించి మరింత బలపడే క్రమంలో తమిళనాడు తీరం దిశగా రానుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తమిళనాడులో తీరం దాటితే కోస్తాపై ప్రభావం రెండు, మూడు రోజుల వరకు ఉంటుందని, దీనిపై సోమవారం నాటికి మరింత స్పష్టత వస్తుందని వాతావరణ నిపుణుడు ఒకరు తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో మంగళవారం నుంచి నుంచి గురువారం వరకు ప్రకాశం, నెల్లూరు, బుధ-గురువారాల్లో పశ్చిమగోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇంకా 17 నుంచి 20వ తేదీ వరకు కోస్తాలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. కోస్తా జిల్లాల్లో వరి, పత్తి, పొగాకు, ఇతర పంటలు సాగుచేస్తున్న రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వరి కోతలను రెండు, మూడు రోజులపాటు వాయిదా వేసుకోవాలని, ఇప్పటికే కోత కోసి పొలాల్లో ఉన్న వరి పనలను కుప్పలుగా వేసుకోవాలని సూచించారు.

  • పెరిగిన చలి..

మధ్యభారతం మీదుగా వస్తున్న చలి గాలుల ప్రభావంతో ఛత్తీ్‌సగఢ్‌, దానికి ఆనుకుని ఒడిశా, ఉత్తరాంధ్ర జిల్లాలు, తెలంగాణకు ఆనుకుని కోస్తా ప్రాంతాల్లో చలి మరింత పెరిగింది. అనేక ప్రాంతా ల్లో మంచు కురిసింది. ఆదివారం విశాఖ ఏజెన్సీలోని జి.మాడుగులలో 5.6, కుంతలంలో 5.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జి.మాడుగులలో ఈ ఏడాది నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత ఇదే. శనివారం జి.మాడుగులలో 8.9 డిగ్రీలుండగా, ఒక్క రోజులో మూడు డిగ్రీలు తగ్గడం గమనార్హం. గత మూడు రోజులుగా ఏజెన్సీలో సింగిల్‌ డిజిట్‌ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Updated Date - Dec 16 , 2024 | 05:07 AM