Rains: ఎల్లుండి నుంచి భారీ వర్షాలు
ABN , Publish Date - Jun 23 , 2024 | 12:27 PM
ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని చోట్ల వాతావరణం చల్లగా మారింది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో మోస్తరు వర్షం ఉంటుందని పేర్కొన్నారు.
అమరావతి: ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం నుంచి భారీ వర్షాలు (Rains) కురవనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని చోట్ల వాతావరణం చల్లగా మారింది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో మోస్తరు వర్షం ఉంటుందని పేర్కొన్నారు. అనకాపల్లి, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తామని ప్రకటించారు. ఏరువాక పౌర్ణమి ముగియడంతో వ్యవసాయ పనుల్లో రైతులు బిజీగా ఉన్నారు.