Share News

Heavy Rains: ఉత్తరాంధ్రకు గండం.. వాయుగుండం

ABN , Publish Date - Oct 19 , 2024 | 06:00 PM

బంగాళాఖాతంలో తుఫాన్‌లు, వాయుగుండాలకు అనుకూల వాతావరణం నెలకొంది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. దీంతో గల్ఫ్‌ ఆఫ్‌ థాయ్‌లాండ్‌ నుంచి వచ్చే తుఫాన్ల అవశేషాలు బంగాళాఖాతంలో ప్రవేశించిన వెంటనే బలపడుతున్నాయి. అటువంటి అవశేషంతో వచ్చిన ఉపరితల ఆవర్తనం అక్టోబర్ 20వ తేదీన ఉత్తర అండమాన్‌ తీరంలోని సముద్రంలోకి ప్రవేశించనుంది.

Heavy Rains: ఉత్తరాంధ్రకు గండం.. వాయుగుండం

విశాఖపట్నం, అక్టోబరు 19: బంగాళాఖాతంలో తుఫాన్‌లు, వాయుగుండాలకు అనుకూల వాతావరణం నెలకొంది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. దీంతో గల్ఫ్‌ ఆఫ్‌ థాయ్‌లాండ్‌ నుంచి వచ్చే తుఫాన్ల అవశేషాలు బంగాళాఖాతంలో ప్రవేశించిన వెంటనే బలపడుతున్నాయి. అటువంటి అవశేషంతో వచ్చిన ఉపరితల ఆవర్తనం అక్టోబర్ 20వ తేదీన ఉత్తర అండమాన్‌ తీరంలోని సముద్రంలోకి ప్రవేశించనుంది.

Also Read:PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. ఈ పథకం కింద రూ. 15 లక్షల సాయం


దీని ప్రభావంతో అక్టోబర్ 21 లేదా 22వ తేదీ తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది 24వ తేదీన వాయుగుండంగా బలపడనుంది. అనంతరం వాయవ్యంగా పయనించే క్రమంలో దక్షిణ ఒడిశాతోపాటు ఆ పక్కనే ఉన్న ఉత్తరాంధ్ర తీరం దిశగా వస్తుందని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ సారి నైరుతి రుతుపవనాలు చురుకుగా పని చేశాయి. దాంతో దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. ఇక రుతుపవనాలు.. అక్టోబర్ 15వ తేదీన నిష్క్రమించాయి.

Also Read: Maoist Party: కిషన్ జీ భార్య అరెస్ట్.. క్లారిటీ ఇచ్చిన మావోయిస్ట్ పార్టీ


అయితే అదే రోజు ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయి. వీటి రాకతో సముద్రంలో అలజడి రేగి.. తుఫాన్లు, వాయుగుండాలు సంభవిస్తాయని చెప్పారు. అక్టోబరులో సాధారణం కంటే అధిక వర్షపాతం, రాత్రి వేళ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని పేర్కొంది. మరోవైపు.. గురువారం ఉదయం చెన్నై సమీపాన తీరం దాటిన వాయుగుండం పశ్చిమ వాయవ్యంగా పయనించే క్రమంలో పూర్తిగా బలహీనపడింది. దీని ప్రభావంతో శుక్రవారం రాత్రికి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వారు చెబుతున్నారు.

Also Read:Telangana: బావ బామ్మర్దుల తీరు ఈస్టమన్ కలర్ లాగా ఉంది


ప్రకాశం జిల్లాలో...

ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ప్రకాశం జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ క్రమంలో ఒంగోలులోని పలు ప్రదేశాల్లో భారీ వర్షం ఒక్కసారిగా కురిసింది. దీంతో నగరంలోని రోడ్లన్ని జలమయమయ్యాయి. ఒంగోలులోని ప్రధాన రహదారులు మోకాళ్ల లోతు నీళ్ళతో నిండిపోయి. దీంతో రహదారులు చెరువులను తలపించాయి. రోడ్లపై నిలిచిన వర్షపు నీటిలో రాకపోకలకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒంగోలుతో పాటు కొండేపి, కనిగిరి, మార్కాపురం, దర్శి, సంతనూతలపాడు తదితర ప్రాంతాల్లో సైతం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Also Read: Telangana: ఆసుపత్రిలో కిడ్నాప్ కలకలం.. ఏడాది బాలుడు అదృశ్యం

For AndhraPradesh News And Telugu News

Updated Date - Oct 19 , 2024 | 06:00 PM