AP High Coourt : విక్రాంత్‌రెడ్డి బెయిల్ కేసులో కేవీ రావు ఇంప్లీడ్‌కు ఓకే
ABN , Publish Date - Dec 25 , 2024 | 06:52 AM
కాకినాడ డీప్ వాటర్ పోర్ట్, కాకినాడ సెజ్‌లోని వాటాల బదిలీ వ్యవహారంలో సీఐడీ కేసులో ముందస్తు బెయిల్ కోసం విక్రాంత్‌రెడ్డి వేసిన పిటిషన్‌లో తనను ప్రతివాదిగా చేర్చుకోవాలని కోరుతూ ఫిర్యాదుదారుడు..
అమరావతి, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): కాకినాడ డీప్ వాటర్ పోర్ట్, కాకినాడ సెజ్‌లోని వాటాల బదిలీ వ్యవహారంలో సీఐడీ కేసులో ముందస్తు బెయిల్ కోసం విక్రాంత్‌రెడ్డి వేసిన పిటిషన్‌లో తనను ప్రతివాదిగా చేర్చుకోవాలని కోరుతూ ఫిర్యాదుదారుడు కేవీ రావు వేసిన ఇంప్లీడ్ పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం అనుమతించింది. కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. విక్రాంత్‌రెడ్డిపై తొందరపాటు చర్యలు వద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను అప్పటివరకు పొడిగించింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృపాసాగర్ ఉత్తర్వులు జారీ చేశారు. డీప్ వాటర్ పోర్ట్, సెజ్‌ల వాటాలను బలవంతంగా అరబిందోకు బదలాయించారన్న కేవీరావు ఫిర్యాదు ఆధారంగా సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ1గా ఉన్న వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్‌రెడ్డి ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ వేశారు. కేవీరావు తరఫు న్యాయవాది శరత్‌చంద్ర స్పందిస్తూ తమను ప్రతివాదిగా చేర్చాలని అనుబంధ పిటిషన్ వేశామన్నారు.