AP Highcourt: ఏపీలో అక్రమ మైనింగ్‌పై హైకోర్టు సీరియస్
ABN , Publish Date - Feb 14 , 2024 | 02:35 PM
Andhrapradesh: రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌పై ఏపీ హైకోర్టు సీరియస్ అయ్యింది. అక్రమ మైనింగ్‌పై అనేక పిటిషన్లు వస్తున్నాయని ధర్మాసనం పేర్కొంది. అధికారులు ఆపకపోతే తగిన చర్యలు తీసుకుంటామని కోర్టు హెచ్చరించింది.
అమరావతి, ఫిబ్రవరి 14: రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌పై ఏపీ హైకోర్టు (AP High Court) సీరియస్ అయ్యింది. అక్రమ మైనింగ్‌పై అనేక పిటిషన్లు వస్తున్నాయని ధర్మాసనం పేర్కొంది. అధికారులు ఆపకపోతే తగిన చర్యలు తీసుకుంటామని కోర్టు హెచ్చరించింది. చిత్తూరు జిల్లాలో అక్రమ మైనింగ్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. అక్రమ మైనింగ్‌పై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని హైకోర్టులో శెట్టిప్పం తంగల్ సర్పంచ్ పిటిషన్ దాఖలు చేశారు. యథేచ్ఛగా అక్రమ మైనింగ్ జరుగుతోందని పిటిషనర్ తరుపు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో చిత్తూరులో అక్రమ మైనింగ్‌పై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో ప్రతి జిల్లాలో పరిస్థితి ఇలానే ఉందంటూ హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకోకుంటే మైనింగ్ అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చిరిస్తూ.. తదుపరి విచారణను హైకోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...