AP NEWS: విద్యాసంస్థల్లో పదోన్నతులు అలా ఎలా సమకూరుస్తారు.. ప్రభుత్వంపై హైకోర్టు ప్రశ్నలవర్షం
ABN , Publish Date - Apr 01 , 2024 | 10:43 PM
విద్యాసంస్థల్లో పదోన్నతులు అలా ఎలా సమకూరుస్తారు.. ప్రభుత్వంపై హైకోర్టు ప్రశ్నలవర్షం
అమరావతి: విద్యాసంస్థల్లో పదోన్నతులకు సమన్యాయం, సానుభూతి ప్రామాణికం కాకూడదని.. అలా చేస్తే లైబ్రేరియన్లకు పుస్తకంలోని కంటెంట్‌పై అవగాహన ఎలా ఉంటుందని ఏపీ హైకోర్టు (AP High Court)ప్రశ్నించింది. లైబ్రేరియన్లకు లెక్చరర్లగా పదోన్నతులు కల్పించడంపై హైకోర్ట్ సోమవారం నాడు విచారణ చేపట్టింది. హైకోర్ట్ ఆదేశాల మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ హాజరయ్యారు. సీనియారిటీ ఉందని నర్సింగ్ సూపరింటెండెంట్‌కు సర్జన్ గా పదోన్నతి కల్పిస్తారా? అని నిలదీసింది.
YCP: వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు ఘోర పరాభవం
IIT, IIM, మెడికల్ కాలేజీలకు లైబ్రేరియన్లు, PD లు నేతృత్వం వహిస్తున్నారా? అని మందలించింది. అలాంటి ఉంధంతాలు ఏమైనా ఉంటే చెప్పాలని హైకోర్ట్ నిలదీసింది. టీచర్లు అందరినీ తీసేసి AI టెక్నాలజీను ఉపయోగించుకోవచ్చు కదా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్‌పై హైకోర్ట్ ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రభుత్వం తీసుకునే చర్యలతో వేలాదిమంది విద్యార్థులు భవిష్యత్ నాశనమవుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ జీవోను లోతుగా మరోసారి పరిశీలించాలని సూచించింది. హైకోర్టును విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి కొంత సమయం కోరారు. దీంతో హైకోర్టు విచారణను ఏప్రియల్ 18వ తేదీకు వాయిదా వేసింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి