Share News

Chandrababu: సీటొచ్చిందని ఈగో వద్దు.. తేడా వచ్చిందో..!?

ABN , Publish Date - Feb 26 , 2024 | 03:33 AM

AP Elections 2024: సీట్లొచ్చాయని అభ్యర్థులెవరూ ఈగోలకు వెళ్లొద్దని టీడీపీ అధినేత చంద్రబాబు నూతన అభ్యర్థులకు సూచించారు.

Chandrababu: సీటొచ్చిందని ఈగో వద్దు.. తేడా వచ్చిందో..!?

  • తేడా వస్తే మార్చేస్తా: చంద్రబాబు

అభ్యర్థులకు ప్రజల మద్దతు, ఆమోదం ఉండాలని కొత్త విధానం ద్వారా వారిని ఎంపిక చేశాం. దేశ చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా 1.3 కోట్ల మంది నుంచి అభిప్రాయాలు సేకరించాం. సుదీర్ఘ కసరత్తు చేశాం.జగన్‌ ఎన్నికల్లో విజయానికి తన పాలనను నమ్ముకోలేదు. దౌర్జన్యాలు, అక్రమాలు, దొంగ ఓట్లు, డబ్బును నమ్ముకున్నాడు. ఊహించని స్థాయిలో కుట్రలు, కుతంత్రాలు చేస్తాడు. ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి.

- చంద్రబాబు

  • వారం వారం మీ పనితీరు సమీక్షిస్తా

  • ఎన్నికల వరకు సర్వేలు చేయిస్తా

  • అసంతృప్తుల ఇళ్లకు పది సార్లు వెళ్లి బుజ్జగించండి

  • జనసేన నేతలను గౌరవించండి

  • ఉభయులూ సమన్వయంతో వెళ్తే నూరు శాతం ఓట్ల బదిలీ

  • ఈ 40 రోజులూ ప్రజల్లో ఉండాలి

  • వీడియో కాన్ఫరెన్స్‌లో కొత్త అభ్యర్థులకు బాబు దిశా నిర్దేశం

అమరావతి, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): సీట్లొచ్చాయని అభ్యర్థులెవరూ (TDP-Janasena First List) ఈగోలకు వెళ్లొద్దని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) నూతన అభ్యర్థులకు సూచించారు. ఏదైనా తేడా వస్తే వారిని మార్చడానికి సిద్ధమని స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేయడానికి ఎంపిక చేసిన కొత్త అభ్యర్థులతో ఆదివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తొలుత వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఈ 40 రోజుల్లో ఏం చేయాలో దిశానిర్దేశం చేశారు. ఎంత సీనియర్‌ నేత అయినా నియోజకవర్గంలో ఎన్ని సానుకూల అంశాలు ఉన్నా.. చివరి నిమిషం వరకు ప్రజల్లోనే ఉండి కష్టపడాలన్నారు. ‘నియోజకవర్గంలో అసంతృప్తితో ఉన్న నాయకులు, కార్యకర్తలను కలుపుకొని పోవాలి. ఎవరైనా అసంతృప్తితో ఉంటే ఒకటికి పదిసార్లు స్వయంగా వెళ్లి కలవాలి. అభ్యర్థినంటూ ఈగోతో వ్యవహరిస్తే కుదరదు. తొలి జాబితాలో సీట్లు పొందినవారి పనితీరు సరిగా లేకుంటే మార్చేందుకు ఎంత మాత్రం వెనుకాడను. ప్రతి వారం మీ పనితీరు సమీక్షిస్తా. ఎన్నికల వరకు వారానికోసారి సర్వే చేయిస్తా. తేడా వస్తే వేటు తప్పదు’ అని హెచ్చరించారు. తటస్థులను కలవాలని, రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని వివరించి అన్ని వర్గాల మద్దతూ కోరాలని సూచించారు. మంచివారు పార్టీలోకి వస్తే ఆహ్వానించాలన్నారు.

రాష్ట్ర ప్రయోజనాలతో పాటు గెలుపే లక్ష్యంగా టీడీపీ అభ్యర్థుల ఎంపిక జరిగిందని చెప్పారు. వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకమని, 5కోట్ల మంది భవిష్యత్‌ కోసమే టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తున్నాయని తెలిపారు. ‘గతంలో ఎప్పుడూ ఇంతముందుగా అభ్యర్థుల ప్రకటన జరుగలేదు. వచ్చే 40రోజులు అత్యంత కీలకం. నిత్యం ప్రజల్లో ఉండి వారికి నమ్మకం, ధైర్యం అందించాలి. ఇప్పటికే సూపర్‌ సిక్స్‌ పథకాలు ప్రకటించాం. ఇప్పుడు 99 చోట్ల ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించాం. ప్రజలతో ఓట్లు వేయించాల్సిన బాధ్యత మీపై ఉంది. మన మిత్రపక్షమైన జనసేన నేతలను గౌరవించి వారిని కలుపుకొని పోవాలి. రెండు పార్టీల నేతల సమన్వయంతో పనిచేస్తే నూటికి నూరు శాతం ఓట్ల బదిలీ జరుగుతుంది’ అని తేల్చిచెప్పారు.

జగన్‌ను ఓడించేందుకు జనం సిద్ధం

చరిత్రలో చూడని విధ్వంస పాలకుడైన జగన్‌ను ఓడించేందుకు జనం సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు చెప్పారు. అతడి అహంకారమే అతడి పతనానికి నాందిగా పేర్కొన్నారు. ‘ఎన్నికలకు జగన్‌ సిద్ధంగా లేరు. ‘సిద్ధం’ పేరిట సభలు పెడుతున్నా... అభ్యర్థులను ప్రకటించలేకపోయారు. పిలుపిచ్చారు. ప్రతి అభ్యర్థీ ఒక న్యాయవాదిని నియమించుకోవాలన్నారు. ప్రచార విభాగాన్ని బలోపేతం చేసుకోవాలని, ప్రభుత్వ విధానాలతో పాటు స్థానిక ఎమ్మెల్యేల పనితీరును ఎండగట్టేలా కార్యక్రమాలు రూపొందించుకోవాలని సూచించారు. ఐదేళ్ల పాలనపై గ్రామాల్లో వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా అసంతృప్తితో ఉన్నారని తెలిపారు.

Updated Date - Feb 26 , 2024 | 08:22 AM