విశాఖ ఐఐఎంకు 4 జాతీయ అవార్డులు
ABN , Publish Date - Nov 27 , 2024 | 04:42 AM
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విశాఖపట్నం (ఐఐఎంవీ) నాలుగు కేటగిరీల్లో జాతీయ స్థాయి అవార్డులను దక్కించుకుంది.
రెండు విభాగాల్లో ప్రథమ స్థానం.. మరో రెండింటిలో రెండవ స్థానం
విశాఖపట్నం, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విశాఖపట్నం (ఐఐఎంవీ) నాలుగు కేటగిరీల్లో జాతీయ స్థాయి అవార్డులను దక్కించుకుంది. ప్రతిష్ఠాత్మకమైన పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పీఆర్‌ఎ్‌సఐ) అందించే అవార్డులకు ఐదు విభాగాలకు ఐఐఎం దరఖాస్తు చేయగా, రెండు కేటగిరీల్లో ప్రథమ స్థానంలో, మరో రెండు కేటగిరీల్లో రెండో స్థానంలో నిలిచింది. కాఫీ టేబుల్ బుక్ కేటగిరీలో ఐఐఎం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్న ఐఐఎంవీ ఫీల్డ్ తొలిస్థానాన్ని దక్కించుకుంది. అలాగే డిఫెన్స్ సెక్టార్ కేటగిరీలో ఐఐఎంవీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ప్రథమ స్థానం దక్కించుకుంది. అలాగే, మహిళా అభివృద్ధి కేటగిరీలో ఉత్తమ సామాజిక సేవ కింద అమలు చేసిన నారీమణి ప్రోగ్రామ్ రెండో స్థానాన్ని దక్కించుకుంది. అలాగే, నైపుణ్య శిక్షణలో ఐఐఎంవీలో అమలు చేస్తున్న భవిష్యత్తు నాయకత్వాన్ని తీర్చిదిద్దడం అనే కార్యక్రమం రెండో స్థానాన్ని దక్కించుకుంది. అవార్డులు దక్కడం పట్ల ఐఐఎంవీ డైరక్టర్ ప్రొఫెసర్ ఎం.చంద్రశేఖర్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇవి ఫ్యాకల్టీ అంకితభావానికి నిదర్శనమన్నారు. అక్రిడేషన్‌కు, ర్యాంకింగ్స్‌కు ఈ అవార్డులు ఎంతగానో ఉపయోగపడతాయని వెల్లడించారు. తమ పనితీరును గుర్తించినందుకు పీఆర్‌ఎ్‌సఐకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే నెలలో జరగనున్న పీఆర్‌ఎ్‌సఐ జాతీయ కాన్ఫరెన్స్‌లో ఈ అవార్డులను అందుకోనున్నారు.