Share News

Pension Distribution: రాష్ట్ర చరిత్రలో రికార్డు స్థాయిలో పెన్షన్ల పంపిణీ..

ABN , Publish Date - Jul 01 , 2024 | 08:32 PM

ఆంధ్రప్రదేశ్(Andhra pradesh) రాష్ట్ర చరిత్రలో రికార్డు స్థాయిలో పెన్షన్ల పంపిణీ(Pension Distribution) కార్యక్రమం జరిగింది. ఇవాళ(సోమవారం) ఒక్క రోజులో 95శాతం మేర పెన్షన్లు పంపిణీ చేసి చంద్రబాబు(CM Chandrababu) సర్కార్ రికార్డు సృష్టించింది. సాయంత్రం ఏడు గంటల సమయానికి కల్లా 61,60,825మందికి నగదు పంచి 94.15శాతం మేర పంపిణీ పూర్తి చేశారు.

Pension Distribution:  రాష్ట్ర చరిత్రలో రికార్డు స్థాయిలో పెన్షన్ల పంపిణీ..

అమరావతి: ఆంధ్రప్రదేశ్(Andhra pradesh) రాష్ట్ర చరిత్రలో రికార్డు స్థాయిలో పెన్షన్ల పంపిణీ(Pension Distribution) కార్యక్రమం జరిగింది. ఇవాళ(సోమవారం) ఒక్క రోజులో 95శాతం మేర పెన్షన్లు పంపిణీ చేసి చంద్రబాబు(CM Chandrababu) సర్కార్ రికార్డు సృష్టించింది. సాయంత్రం ఏడు గంటల సమయానికి కల్లా మొత్తం 65,18,496పెన్షనర్లకు గాను 61,60,825మందికి నగదు పంచి 94.15శాతం మేర పంపిణీ పూర్తి చేశారు. ఇవాళ ఒక్కరోజే రూ.4,159 కోట్లు పెన్షన్ల రూపంలో లబ్ధిదారులకు అందజేశారు. 2.65లక్షల మంది వాలంటీర్లు ఉన్నా గతంలో ఎన్నడూ ఇంత వేగంగా నగదు పంపిణీ జరగలేదు.


శ్రీకాకుళం, విజయనగరం, కడప జిల్లాల్లో అత్యధికంగా 97శాతం ఫించన్ల పంపిణీ పూర్తయ్యింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యల్పంగా 91శాతం పూర్తయ్యింది. ఉదయం 6గంటల నుంచే 1.30లక్షల మంది సచివాలయ ఉద్యోగులు 12గంటల వ్యవధిలో రికార్డుస్థాయిలో పెన్షన్లు పంపిణీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2.65మంది వాలంటీర్లు ఉన్నా ఒక్క రోజులో పంపిణీ చేసింది కేవలం 88శాతం మాత్రమే. సమర్థ నాయకత్వం ఉంటే అధికారులు, ఉద్యోగులు ఎంత అద్భుతంగా పనిచేస్తారనేది నిరూపితమైందని పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న అధికారులు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు.

ఇది కూడా చదవండి:

AP News: సార్వత్రిక విద్యాపీఠం పది, ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి లోకేశ్..

Updated Date - Jul 01 , 2024 | 08:49 PM