AP News: ఏపీకి నిఘా విభాగం హెచ్చరిక.. ఎన్నికల ఫలితాల తర్వాత..
ABN , Publish Date - May 17 , 2024 | 11:55 AM
ఏపీకి నిఘా విభాగం హెచ్చరికలు జారీ చేసింది. ఎన్నికల ఫలితాల తర్వాత ప్రతీకార దాడులకు అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది. జూన్ 19 వరకూ పోలీసు బలగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అవసరమైతే కేంద్ర బలగాలను మోహరించాలని ఇంటెలిజెన్స్ తెలిపింది. ఈ మేరకు జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లకు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది.
అమరావతి: ఏపీ ఎన్నికల్లోనూ.. అవి ముగిసిన తర్వాత జరిగిన అల్లర్లు అన్నీ ఇన్నీ కావు. కొన్ని చోట్ల రక్తం ఏరులై పారింది. తెలుగు తమ్ముళ్ల మీద ఒక్కసారిగా వైసీపీ మూకలు విరుచుకుపడ్డాయి. మహిళలు.. కనీసం గర్భిణులని కూడా చూడకుండా దాడులు చేశారు. పురుషుల తలలు పగులగొట్టారు. ఆసుపత్రుల్లోకి వెళ్లి మరీ రోగులపై దాడులు చేశారు. అయితే ఇవి ఇప్పటితో ముగిసేవి కావని.. ఫలితాలు వెలువడిని తర్వాత కూడా కంటిన్యూ అవుతాయని నిఘా విభాగం హెచ్చరిస్తోంది.
పల్నాడు జిల్లా: సర్పంచ్ ఇంటిపై వైసీపీ దాడి..
ఏపీకి నిఘా విభాగం హెచ్చరికలు జారీ చేసింది. ఎన్నికల ఫలితాల తర్వాత ప్రతీకార దాడులకు అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది. జూన్ 19 వరకూ పోలీసు బలగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అవసరమైతే కేంద్ర బలగాలను మోహరించాలని ఇంటెలిజెన్స్ తెలిపింది. ఈ మేరకు జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లకు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. పల్నాడు, అనంతపురం, చిత్తూరు, తిరుపతి, కడప, కర్నూల్ జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. ఘర్షణలు జరిగే ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 25 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను ఫలితాల తర్వాత 2 వారాల వరకూ కొనసాగించాలని హోంశాఖకు కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
పవన్ కళ్యాణ్ గెలుపుపై కోట్లలో బెట్టింగ్
హైదరాబాద్‌లో కుండపోత వర్షం దృశ్యాలు..
Read Latest AP News and Telugu News