Share News

Pawan Kalyan: పవన్ జీవిత రహస్యాలను బయట పెట్టిన తల్లి

ABN , Publish Date - Oct 02 , 2024 | 09:40 PM

పవన్ కల్యాణ్.. శ్రీవెంకటేశ్వర స్వామి వారి దీక్ష పవన్ చేయడం తనకు సంతోషాన్ని ఇచ్చిందన్నారు. అయితే పవన్‌కు చిన్న నాటి నుంచి కొంచెం ఆధ్యాత్మిక ఆలోచనలు ఎక్కువగానే ఉండేవన్నారు. తన కోసం అయ్యప్ప మాల వేసుకుని శబరిమల సైతం వెళ్లొచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు.

Pawan Kalyan: పవన్ జీవిత రహస్యాలను బయట పెట్టిన తల్లి

హైదరాబాద్, అక్టోబర్ 02: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ఆయన కన్న తల్లి కొణిదల అంజనా దేవి కీలక వ్యాఖ్యలు చేశారు. నాడు సినిమాల కోసం కష్టపడితే.. నేడు ప్రజల కోసం పవన్ కల్యాణ్ కష్టపడుతున్నాడన్నారు. పవన్ కల్యాణ్ తల్లి అంజనమ్మ తొలిసారిగా ఇంటర్వ్యూ ఇచ్చారు. అందుకు సంబంధించిన వీడియోను జనసేన పార్టీ బుధవారం తన ఎక్స్ ఖాతా వేదికగా విడుదల చేసింది. ఇది సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారింది. పవన్ కల్యాణ్ గురించి ఆమె ఏమన్నారంటే... భగవంతుడు ప్రజలకు సేవ చేసే భాగ్యం పవన్ కల్యాణ్‌కు కలిగించాడన్నారు. ప్రజల కష్టం తీర్చాలని ఆయన తపన పడుతున్నాడని తెలిపారు. మొదటి నుంచీ పట్టు పరుపులని చూడడని.... నేల మీదే పడుకునే వాడని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నారు. చిన్ననాటి నుంచి తనకి ఇది కావాలని అడిగే వ్యక్తి కాదన్నారు.

Dasara 2024: దుర్గమ్మకి పట్టు వస్త్రాలు సమర్పించిన విజయవాడ సీపీ దంపతులు


అందరూ భోజనాలు చేశాక.. ఆ తర్వాత వచ్చి తినేవాడని చెప్పారు. అయితే తాను చేసిన పలావు మాత్రం చాలా అమితంగా ఇష్టపడతాడని తెలిపారు. ఇక ఇది వండి పెట్టు.. అది చేసి పెట్టు అని ఏ రోజు తనను అడగలేదన్నారు. తాను తినాలని చేసి పెడితే.. మాత్రం తప్పకుండా తినేవాడని చెప్పారు. శ్రీవెంకటేశ్వర స్వామి వారి దీక్ష పవన్ చేయడం తనకు సంతోషాన్ని ఇచ్చిందన్నారు. అయితే పవన్‌కు చిన్న నాటి నుంచి కొంచెం ఆధ్యాత్మిక ఆలోచనలు ఎక్కువగానే ఉండేవన్నారు. తన కోసం అయ్యప్ప మాల వేసుకుని శబరిమల సైతం వెళ్లొచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు. అలా అని ప్రతిరోజూ దండాలు పెట్టి, పూజలు ఏమీ చేయడన్నారు. ఇక అన్న ప్రసాన సమయంలో పవన్ కల్యాణ్.. కత్తి పెన్ను పట్టుకున్నాడని వివరించారు.

Also Read: భారతీయులు జాగ్రత్త.. అప్రమత్తమైన కేంద్రం..


అప్పుడే ప్రజలకు ఏదోకటి చేస్తాడని తాను ఊహించానన్నారు. పవన్‌.. తన తండ్రిలాగా ఎక్కవ మాట్లాడరని.. అయితే అనుకున్న పనులు మాత్రం చేస్తారని చెప్పారు. మిత భాషి కావడంతో.. వాళ్ల నాన్నా సైతం పవన్ కల్యాణ్‌ను ఇష్టపడేవారన్నారు. ఈ ఇద్దరికి మొండి పట్టుదల ఉండేదన్నారు. చిన్నప్పటి నుంచి పవన్ బాగా పుస్తకాలు చదవడం అలవాటు ఉండేదని గుర్తు చేశారు. హైస్కూల్ స్థాయి నుంచి నేటి వరకు అదే విధంగా పుస్తకాలు చదువుతూనే ఉన్నాడని ఆమె వివరించారు.

Also Read: Dussehra Holidays 2024: దసర వేడుకలు చూడాలంటే.. ఈ నగరాలకు వెళ్లాల్సిందే..


ఈ పుస్తకాల వల్లే అతనికి ఈ సమాజంపై ఇంత ఆలోచన వచ్చిందని తాను భావిస్తున్నానట్లు తెలిపారు. డిప్యూటీ సీఎం అవుతాడని తాను ముందు ఊహించ లేదన్నారు. వారి వారి అదృష్టాన్ని బట్టి జీవితం ఉంటుందని తెలిపారు. చిరంజీవి సైతం.. తన తమ్ముడు పవన్‌ని బాగా చూసుకునే వాడని పేర్కొన్నారు. ఇప్పటికి పవన్ కల్యాణ్ వదిన చాటు బిడ్డేనని అభివర్ణించారు. ఎందుంటే.. తన భర్తకు ఉద్యోగరీత్య బదిలీలు ఎక్కువగా జరుగుతాయని చెప్పారు. ఈ నేపథ్యంలో చెన్నైలో పెద్దబ్బాయి దగ్గరే పవన్ ఉండేవాడన్నారు. శ్రీ కళ్యాణ్ కుమార్ అని తాము పేరు పెట్టామని.. కానీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అని పేరు మార్చుకున్నాడని వివరించారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ ఆలోచన విధానం బాగుందని అభిప్రాయపడ్డారు. తన బిడ్డ ప్రజలకు సేవ చేయడం, మంచి చేయడం తనకు ఆనందాన్నిస్తుందన్నారు.

Also Read: Kolkata: ర్యాలీలో కశ్మీర్ ఆజాదీ నినాదాలు.. మమత ప్రభుత్వాన్ని నివేదిక కోరిన కేంద్రం

Also Read: Arunachalam Tour: దసరా వేళ అరుణాచలేశ్వరుడి దర్శనం.. తెలంగాణ టూరిజం సూపర్ ప్యాకేజీ


కొంతమంది బాధలు వింటుంటే.. తనకు చాలా ఆవేదన కలిగిన సందర్భాలు ఉన్నాయిని ఆమె తెలిపారు. మొదటి నుంచి పవన్ కల్యాణ్‌కు సాయం చేసే గుణం ఎక్కువగా ఉండేదన్నారు. తన కళ్ల ముందు ఏదైనా జరిగితే వెంటనే స్పందించి.. ఆదుకుంటాడని చెప్పారు. అయితే డిప్యూటీ సీఎం అవుతాడని మాత్రం అనుకోలేదు.. జరిగిందన్నారు. దేవుడు ఎలా రాస్తే.. అలాగే అతను ఎదుగుతాడని చెప్పారు. గతంలో తనను పోలీసులు అడ్డుకుంటే.. రోడ్డు మీద పడుకున్న తీరు చూసి తనకు బాధ కలిగిందన్నారు.

Also Read: అక్టోబర్ 2: భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి

Also Read: Kishan Reddy: ప్రధాని మోదీ తల్లి పేరుతో ప్రతి ఒక్కరు ఓ చెట్టు నాటండి

Also Read: Arvind Kejriwal: కొత్త ఇంటికి మారనున్న కేజ్రీవాల్


ఇంత అవసరమా?.. ఇన్ని కష్టాలు ఎందుకు పడటం అని తనకు అనిపించిందన్నారు. ప్రజల కోసం కష్టపడి.. ముందుకు నడిచిన పవన్ కళ్యాణ్‌కు దేవుడు మంచి బాధ్యత ఇచ్చాడని తెలిపారు. తమ బిడ్డ మంచి వృద్దిలోకి రావాలని ఏ తల్లి అయినా కోరుకుంటుందని.. తాను సైతం అదే కోరుకుంటున్నానని పవన్ కల్యాణ్ తల్లి కొణిదల అంజనా దేవి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

For AndhraPradesh News And Telugu News...

Updated Date - Oct 02 , 2024 | 09:40 PM