IRAS Officer : సత్యనారాయణ ఎస్కేప్
ABN , Publish Date - Jun 17 , 2024 | 05:49 AM
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిన ఐఆర్‌ఏఎస్ అధికారి కేవీవీ సత్యనారాయణ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చల్లగా జారుకున్నారు. తన మాతృశాఖ రైల్వే్‌సకు వెళ్లిపోయారు. నార్త్ ఈస్టర్న్ రైల్వేలో జాయిన్ కావాల్సిందిగా ఈ నెల 13వ తేదీన రైల్వే బోర్డు ఆయనకు ఆదేశాలిచ్చింది.
గప్‌చు్‌పగా మళ్లీ మాతృశాఖ రైల్వే్‌సకు
జగన్ హయాంలో ఆర్థిక శాఖలో విధులు
అన్ని అవకతవకల్లోనూ భాగస్వామి
జగన్ అస్మదీయులకే బిల్లుల చెల్లింపు
అడ్డగోలు అప్పుల ఆలోచనలూ ఆయనవే
ఆస్తులు, సచివాలయం తాకట్టు వెనుక హస్తం
అమరావతి, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిన ఐఆర్‌ఏఎస్ అధికారి కేవీవీ సత్యనారాయణ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చల్లగా జారుకున్నారు. తన మాతృశాఖ రైల్వే్‌సకు వెళ్లిపోయారు. నార్త్ ఈస్టర్న్ రైల్వేలో జాయిన్ కావాల్సిందిగా ఈ నెల 13వ తేదీన రైల్వే బోర్డు ఆయనకు ఆదేశాలిచ్చింది. ఈ నెల 18వ తేదీతో రాష్ట్రంలో ఆయన డిప్యుటేషన్ ముగియనుంది. 2017 నుంచి రాష్ట్ర ఆర్థిక శాఖలో సెక్రటరీగా విధులు నిర్వహించారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక అత్యంత కీలకమైన నిధుల చెల్లింపు విధులను జగన్ ఈ అధికారి చేతిలో పెట్టారు. ఐదేళ్ల పాటు ఫిఫో ఉల్లంఘిస్తూ జగన్ అస్మదీయులకు మాత్రమే బిల్లులు చెల్లించారు. కేవలం పెండింగ్ బిల్లుల కోసమే హైకోర్టులో 4 లక్షల పిటిషన్లు పడ్డాయి. వీరెవరినీ ఖాతరు చేయకుండా కేవలం జగన్ అస్మదీయులకు బిల్లులు చెల్లిస్తూ స్వామిభక్తిని చాటుకున్నారు. ఎన్నికలు ఫలితాలు వచ్చాక, సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన రోజు కూడా జగన్ లాయర్లకు, అమరావతికి వ్యతిరేకంగా వాదించిన లాయర్లకు బిల్లులు చెల్లించారు.
గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం తెచ్చిన రాజ్యాంగ విరుద్ధ, అడ్డగోలు అప్పుల ఆలోచనలన్నీ సత్యనారాయణవే. వైజాగ్‌లో ప్రభుత్వ భూములు, కార్యాలయాలు, కాలేజీలు, పార్కులు, పోర్టు భూముల నుంచి రాష్ట్ర సచివాలయం తాకట్టు వెనుక ఈ అధికారిదే హస్తం. ఏపీసీఎ్‌ఫఎ్‌సఎస్ పేరుతో శాఖల వద్ద ఉన్న నిధులన్నీ డిపాజిట్ల రూపంలో ఊడ్చేసిన మహా ఘనుడు. ఏపీఎ్‌సడీసీ పేరుతో ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని మళ్లించి బ్యాంకుల నుంచి రూ.25,000 కోట్ల అప్పు రాజ్యాంగ విరుద్ధంగా తెచ్చారు. ఖజానాకు జమ కావాల్సిన మద్యం వ్యాట్ ఆదాయాన్ని స్పెషల్ మార్జిన్ పేరుతో బేవరేజెస్ కార్పొరేషన్‌కు మళ్లించి అడ్డగోలుగా రూ.22,500 కోట్ల అప్పులు చేశారు.
ఏపీఎండీసీ వాటాలు అమ్మకానికి పెట్టి మార్కెట్ నుంచి రూ.7,000 కోట్లు అప్పులు తీసుకొచ్చారు. ఇలాంటి ఘోరమైన అప్పులకు సత్యనారాయణే కారకులు. దేశంలోనే అత్యుత్తమ చెల్లింపుల వ్యవస్థగా అవార్డులు అందుకున్న సీఎ్‌ఫఎంఎ్‌సను సర్వనాశనం చేసి, ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలను గందరగోళం చేశారు. రాష్ట్రానికి ఇంత ద్రోహం చేసిన ఈ అధికారి గప్‌చు్‌పగా రాష్ట్రం నుంచి జారుకున్నారు. గత ఐదేళ్ల పాటు ఆర్థిక శాఖలో జరిగిన అన్ని అవకతవకల్లోనూ ఈ అధికారి భాగస్వామి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత ఐదేళ్లలో వ్యవస్థలను తుంగలో తొక్కి వైసీపీకి ఏకపక్షంగా వ్యవహరించిన అధికారులను రిలీవ్ చేయకూడదని ఆదేశాలిచ్చారు. అయినప్పటికీ సత్యనారాయణ తప్పించుకుని వెళ్లిపోయారు.
కరికాల వలవన్ రాజీనామా
గత ప్రభుత్వం కొంత మంది అఖిల భారత సర్వీస్ అధికారులకు రిటైర్డ్ అయిన తర్వాత కూడా సర్వీస్ కొనసాగించింది. నిబంధనలకు విరుద్ధంగా వారిని కీలక పోస్టుల్లో నియమించింది. కొత్త ప్రభుత్వం రావడంతో ఆ అధికారులందరూ తప్పుకోవాలని సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు దేవదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ రాజీనామా చేశారు. ఆయన ఎక్స్‌టెన్షన్ ఈ ఏడాది ఆగస్టు నెలతో గడువు ముగుస్తుంది. రెండు నెలల ముందే ఆయన రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరో ఐదుగురు అధికారులు రాజీనామా చేయాల్సి ఉంది.