Home » Railway Zone
దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో గుంతకల్లు రైల్వే డివిజన్(Guntakal Railway Division) కొంతమేర కోతకు గురైంది.
రైల్వేలకు బడ్జెట్ కేటాయింపులు పెంచకపోవడంతో రాష్ట్రంలో ప్రతిపాదించిన ప్రాజెక్టులకు మోక్షం లభించే అవకాశాలు కనిపించడం లేదు.
ఆంధ్రప్రదేశ్ పరిధిలోని రైల్వే వ్యవస్థలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రాన్నంతా కలుపుతూ కొత్తగా దక్షిణ కోస్తా రైల్వే జోన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖ కేంద్రంగా జోన్ కార్యాలయం పని చేస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
రీల్స్ పేరుతో రైల్వే కార్యకలాపాలకు ఆటంకం కలిగించడం, ప్రయాణికులకు అసౌకర్యం కల్పించేవారిపై కఠినచర్యలు తీసుకోవాలని రైల్వేబోర్డ్ నిర్ణయించింది.
ప్రయాణికులు అందరూ లబ్ధి పొందేలా రైల్వే తన టికెటింగ్ పాలసీలో మార్పులు చేసింది. ఈ మార్పులు నవంబరు 1, శుక్రవారం నుంచి అమలులోకి వచ్చాయి.
అమరావతి రైలుమార్గంలో కృష్ణానదిపై కొత్తగా ఏర్పాటుచేసే రైలు బ్రిడ్జి ఐకానిక్గా ఉండేలా చూడాలని కేంద్రాన్ని సీఎం చంద్రబాబు కోరారు. రైల్వేలైన్కు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా కవరైపేట రైల్వేస్టేషన్ వద్ద శుక్రవారం రాత్రి 8.30 గంటల సమయంలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. రైల్వేస్టేషన్లో లూప్లైన్లో ఆగివున్న గూడ్సు రైలును మైసూరు నుంచి దర్భంగాకు వెళ్తున్న బాగ్మతి ఎక్స్ప్రెస్ వెనుక నుంచి ఢీకొంది.
రైల్వే ఉద్యోగులకు 78 రోజుల పండుగ బోన్సను ప్రకటించారు. 11.71 లక్షల మంది రైల్వే సిబ్బందికి రూ.2028.57 కోట్లను ఉత్పాదక అనుసంధానిత బోన్సగా చెల్లించనున్నారు.
రహదారులు, జలాశయాలు, రైల్వే ట్రాక్లను ఆక్రమించి నిర్మించిన ఏ మతానికి సంబంధించిన కట్టడాలనైనా తొలగించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే ట్రాకులపై దుండగుల దుశ్చర్యలు కొనసాగుతూనే ఉన్నాయు. ముంబై నుంచి లఖ్నవూ వెళ్తోన్న పుష్పక్ ఎక్స్ప్రెస్ లోకోపైలెట్ గోవిందపురి స్టేషన్ దగ్గరలో ఆదివారం సాయంత్రం 4.15 గంటలకు రైల్వేట్రాకుపై అగ్నిమాపక పరికరాన్ని(ఎర్రని సిలిండర్) గుర్తించి రైలుకి బ్రేకులు వేశారు.