Share News

Jagananna Colony Kahani : జగనన్న కాలనీ కహానీ

ABN , Publish Date - Sep 10 , 2024 | 11:33 PM

నిరుపేదలకు సొం తింటి కల నెరవేరుస్తానని ఆర్భాటపు ప్రకటనలు చేసిన వైసీపీ ప్రభుత్వం చాలీచాలని ఇంటి పట్టాల ను ఇచ్చింది. అంతేకాకుండా సొంతంగా ఇళ్లు కట్టి స్తామన్న ప్రభుత్వం చేతులెత్తేయడంతో నిరుపేద లు ఇళ్లు పూర్తి చేసుకోలేక అష్టకష్టాలు పడుతున్నారు.

Jagananna Colony Kahani : జగనన్న కాలనీ కహానీ
ఉర్లగట్టుపోడు జగనన్న కాలనీ

Jagananna.gif

బిల్లులు తీసుకుని కాంట్రాక్టర్లు పరారీ

కొందరికి బేస్‌మెంట్లే పరిమితం

మరికొందరికి స్థలాలే మిగిలిన వైనం

లబోదిబోమంటున్న లబ్ధిదారులు

రైల్వేకోడూరు, సెప్టెంబరు 10: నిరుపేదలకు సొం తింటి కల నెరవేరుస్తానని ఆర్భాటపు ప్రకటనలు చేసిన వైసీపీ ప్రభుత్వం చాలీచాలని ఇంటి పట్టాల ను ఇచ్చింది. అంతేకాకుండా సొంతంగా ఇళ్లు కట్టి స్తామన్న ప్రభుత్వం చేతులెత్తేయడంతో నిరుపేద లు ఇళ్లు పూర్తి చేసుకోలేక అష్టకష్టాలు పడుతున్నారు. కొన్నింటి బిల్లులు తీసుకుని కాంట్రాక్టర్లు పరారయ్యారనే ఆరోపణలున్నాయి. కొందరికి బేస్‌ మెంట్‌లు మిగలడం, మరి కొందరు ఇంటి స్థలాలకే పరిమితమయ్యారు. రైల్వేకోడూరు, చిట్వేలి, ఓబులవారిపల్లె, పుల్లంపేట, పెనగలూరు మండలాల్లో జగన్‌ ప్రభుత్వం 6378 మంది లబ్ధిదారులకు అట్టహాసంగా ఇళ్ల పంపిణీ చేపట్టారు. ఐదేళ్లలో లబ్ధిదారులకు ఇళ్లు పూర్తి చేయాలనే ధోరణిలో చర్యలు తీసుకోలేకపోయారు. దీంతో చాలా మంది ఇళ్లు పూర్తి చేసుకోలేకపోయారు. వివరాల్లోకెళితే....


Jagananna1.gif

ఇంటివద్ద పెరిగిన పిచ్చి మొక్కలు

రైల్వేకోడూరు మండలంలో 2288 మందికి, చిట్వే లిలో 834, ఓబులవారిపల్లెలో 1226, పెనగలూరు లో 1228, పుల్లంపేటమండలాల్లో 802 మందికి పట్టాలు ఇచ్చారు. మొత్తం 2788 మంది లబ్ధిదారు లు ఇళ్లను పూర్తి చేసుకున్నారు. 240 ఇళ్లకు శ్లాబు లు పూర్తి అయ్యాయి, 807 ఇళ్లు బేస్‌మెంట్లవరకు, 575 ఇళ్లు గోడల లెవల్‌కు, 235 ఇళ్లు పునాది లెవ ల్‌లో ఉన్నాయి. పూర్తి కాని ఇళ్లలో పిచ్చి మొక్కలు మొలిచాయి. జగన్‌ కాలనీల్లో రోడ్లు లేక ఇబ్బందు లు పడుతున్నారు. ఇళ్ల వద్ద మురికి గుంతలు ఏర్ప డ్డాయి. మట్టి రోడ్లపై కంప చెట్లు మొలిచాయి. స్థలాలకు పరిమితమైన వారు బంధువుల ఇళ్లలో తలదాచుకుంటున్నారు. ఇళ్లను ప్రభుత్వమే నిర్మిస్తామని చెప్పి వైసీపీ ప్రభుత్వం మాట తప్పిందని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాల కోసం వైసీపీ నేతలు కొందరు కాంట్రాక్టర్లను నియమించారు. పేమెంట్లు కాంట్రాక్టర్లకే ఇవ్వాలని లబ్ధిదారులకు అధికారులు, నాయకులు సమాచారం పంపించారు. అయితే బిల్లులు పడిన వెంటనే కాంట్రాక్టర్లు పరారీ అయ్యా రని పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు. రైల్వేకోడూరు నియోజకవర్గంలో జగనన్న కాలనీల్లో పా ములు, తేళ్లు తిరుగుతున్నాయని లబ్ధిదారులు ఆం దోళన వ్యక్తం చేస్తున్నారు. కాలనీల్లో రోడ్ల సౌకర్యా లు లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. తా గునీరు, విద్యుత్‌ తదితర మౌలిక సౌకర్యాలు లేక అనేక కష్టాలు పడుతున్నామని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Jagananna3.gifజగనన్న కాలనీలో రోడ్ల దుస్థితి

హౌసింగ్‌ శాఖ ఇచ్చిన డబ్బు సరిపోక కొందరు అప్పు చేసి ఇళ్లను నిర్మించుకున్నారు. జగనన్న కాలనీల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో చాలా మంది కాపురాలు చేయలేకున్నారని లబ్ధిదారులు వివరిస్తున్నారు. రాత్రి వేళ బిక్కుబిక్కుమంటూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. జగన్‌పై ఆశలు పెంచుకుంటే ఇలా చేస్తా రా అని తిట్టిపోసుకుంటున్నారు. బేస్‌మెంట్‌లు వేసుకుని ఐదేళ్లు పూర్తి అయినా ఇంత వరకు చా లా మందికి బిల్లులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశా రు. ఐదేళ్లలో సొంత ఇంటికి సక్రమంగా ప్రారంభోత్సవాలు కూడా చేసుకోలేని స్థితికి లబ్ధిదారులు చేరుకున్నారు. కాంగ్రెస్‌, టీడీపీ ప్రభుత్వంలో ఇంటి నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇచ్చారు. జగన్‌ ప్రభుత్వంలో చాలీచాలని ఇంటి స్థలాలు ఇచ్చి అదికూడా పూర్తి చేయకుండా చేశారని లబ్ధిదారు లు అంటున్నారు. ఇప్పటికైనా హౌసింగ్‌ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టి ఇంటి నిర్మాణాల్లో ఎంత వరకు జాప్యం జరిగిందని ప్రభుత్వానికి నివేదిక ఇస్తే లబ్ధిదారులకు మేలు కలుగుతుందని ఆయా కాలనీ వాసులు కోరుతున్నారు.

చర్యలు తీసుకుంటున్నాము

కాలనీల్లో పెండింగ్‌ ఇంటి నిర్మాణాలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాము. జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక పంపి ఉన్నాము. కాలనీల్లో ఉన్న సమస్యలు పరిష్కారం చేసేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపుతాము.

మురళీక్రిష్ణ, ఏఈ రైల్వేకోడూరు హౌసింగ్‌

స్థలం ఉంది పక్కాగృహం లేదు

స్థలం ఇచ్చారు, ఇల్లు కట్టివ్వలేదు. కనీసం పునాది లెవల్‌కు కూడా చేరుకోలేదు. బిల్లు వచ్చిందో రాలేదో తెలియదు. ఖాళీ స్థలంలో గుడిసె వేసుకుంటే పీకేశారు. బంధువుల ఇంట్లో తలదా చుకుంటున్నాము. కూటమి ప్రభుత్వం ఇంటి నిర్మాణం చేపట్టాలని కోరుకుంటున్నాము.

వంకాయల మంజుల, వెంకటేష్‌

Updated Date - Sep 10 , 2024 | 11:33 PM