Share News

Foreign Investment : ఎఫ్‌డీఐలకు జగన్‌ దెబ్బ!

ABN , Publish Date - Dec 17 , 2024 | 03:51 AM

జగన్‌ జమానాలో రాష్ట్రం విదేశీ పెట్టుబడుల విషయంలో పాతాళంలో ఉందన్న విషయం పార్లమెంటు సాక్షిగా వెల్లడైంది.

Foreign Investment : ఎఫ్‌డీఐలకు జగన్‌ దెబ్బ!

  • 2019-24లో తెలంగాణకు 9,314 మిలియన్‌ డాలర్లు

  • ఆంధ్రకు 1,085 మిలియన్‌ డాలర్లే

  • పార్లమెంటు సాక్షిగా వెల్లడించిన కేంద్రం

న్యూఢిల్లీ, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): జగన్‌ జమానాలో రాష్ట్రం విదేశీ పెట్టుబడుల విషయంలో పాతాళంలో ఉందన్న విషయం పార్లమెంటు సాక్షిగా వెల్లడైంది. 2019 అక్టోబరు నుంచి 2024 సెప్టెంబరు మధ్య పొరుగున ఉన్న తెలంగాణకు 9,314 మిలియన్‌ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) రాగా.. ఏపీకి 1,085.59 మిలియన్‌ డాలర్లు మాత్రమే వచ్చాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధురి వెల్లడించారు. ఈ అంశంలో తెలంగాణ ఏడో స్థానంలో నిలువగా.. ఏపీ 14వ స్థానంలో ఉందని చెప్పారు. సోమవారం లోక్‌సభలో టీడీపీ ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, కృష్ణప్రసాద్‌ తెన్నేటి, పుట్టా మహేశ్‌కుమార్‌ అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు. మహారాష్ట్ర-82,638.08 మిలియన్‌ డాలర్లు, కర్ణాటక-54,573.73, గుజరాత్‌-43,149.95), ఢిల్లీ- 34,920.48, తమిళనాడు-12,560.52, హరియాణా-11,042.92 మిలియన్‌ డాలర్ల విదేశీ పెట్టుబడులతో మొదటి ఆరు స్థానాల్లో ఉన్నాయని తెలిపారు. జార్ఖండ్‌-2,667.10, రాజస్థాన్‌-2,492.33, పశ్చిమ బెంగాల్‌-1,723, ఉత్తరప్రదేశ్‌-1,700.63, కేరళ-1,288.93, పంజాబ్‌-1,197.93 మిలియన్‌ డాలర్లతో ఆంధ్ర కంటే ముందున్నాయి. ఏపీకి వచ్చిన 1,085.59 మిలియన్‌ డాలర్లలో చిత్తూరు జిల్లాకు అత్యధికంగా 446.35 మిలియన్‌ డాలర్లు వచ్చాయని కేంద్ర మంత్రి వెల్లడించారు.

Updated Date - Dec 17 , 2024 | 03:51 AM