అన్నదానంతో అన్నపూర్ణేశ్వరుడి సేవ: జస్టిస్ ఉమాదేవి
ABN , Publish Date - Dec 02 , 2024 | 05:12 AM
అన్నదానం చేయడం ద్వారా అన్నపూర్ణేశ్వరుడి సేవ చేసినట్లేనని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉమాదేవి పేర్కొన్నారు.
అనంతపురం కల్చరల్, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): అన్నదానం చేయడం ద్వారా అన్నపూర్ణేశ్వరుడి సేవ చేసినట్లేనని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉమాదేవి పేర్కొన్నారు. కార్తీక అమావాస్యను పురస్కరించుకుని ఆదివారం అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రి వద్ద సాయిట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో న్యాయమూర్తి పాల్గొన్నారు. ఆస్పత్రికి వచ్చిన రోగులు, వారి బంధువులకు అన్నదానం చేశారు. జస్టిస్ ఉమాదేవి మాట్లాడుతూ... నిరుపేదల ఆకలి తీర్చడమే నిజమైన సేవ అని పేర్కొన్నారు. అన్నదానం ద్వారా ఎంతో ఆత్మసంతృప్తి కలుగుతుందన్నారు. అనేక సంవత్సరాలుగా సాయి ట్రస్టు ఆధ్వర్యంలో ఎంతోమంది పేదల ఆకలి తీరుస్తుండడం అభినందనీయమన్నారు. అనంతరం శిశుగృహలో నవజాత శిశువుల కోసం జస్టిస్ ఉమాదేవి చేతులమీదుగా లాక్టోజిన్ ప్యాకెట్లను అందజేశారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి, బాలసదన్ మేనేజర్ దీప్తి, సాయి ట్రస్టు అధ్యక్షుడు విజయసాయికుమార్ పాల్గొన్నారు.