Share News

AP Politcs: సీఎం వైఎస్ జగన్‌ను కలవనున్న కేఏ పాల్

ABN , Publish Date - Jan 09 , 2024 | 01:57 PM

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఎ పాల్ వచ్చారు. సీఎం వైఎస్ జగన్‌ను కలిసేందుకు అనుమతి లేదని పోలీసులు ఆయనను క్యాంపు కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లే రోడ్డు మెయిన్ గేట్ వద్ద కేఏ పాల్ వేచి చూస్తున్నారు.

AP Politcs: సీఎం వైఎస్ జగన్‌ను కలవనున్న కేఏ పాల్

అమరావతి: తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఎ పాల్ వచ్చారు. సీఎం వైఎస్ జగన్‌ను కలిసేందుకు అనుమతి లేదని పోలీసులు ఆయనను క్యాంపు కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లే రోడ్డు మెయిన్ గేట్ వద్ద కేఏ పాల్ వేచి చూస్తున్నారు.

సీఎం జగన్ ను కలిసేందుకు వచ్చానని ఆయన తెలిపారు. ప్రజా సమస్యలపై సీఎంతో చర్చించి ఎన్నికల్లో కలసి పనిచేద్దామని చెప్పేందుకు వచ్చానన్నారు. సీఎం అపాయింట్‌మెంట్ కోసం వేచి ఉన్నానని.. ఇవాళంతా వేచి చూస్తానని కేఏ పాల్ తెలిపారు. జగన్ అపాయింట్‌మెంట్ ఇస్తే దీవిస్తానని...లేదంటే శపిస్తానని కేఎపాల్ హెచ్చరించారు.

Updated Date - Jan 09 , 2024 | 03:21 PM