Share News

ఓట్ల తొలగింపు కోసం 317 దరఖాస్తులు

ABN , Publish Date - Sep 27 , 2024 | 11:40 PM

పీలేరు నియో జకవర్గం లోని ఓటరు జాబితా నుంచి ఓట్ల తొలగింపు కోసం 317 దరఖాస్తులు అందినట్లు పీలేరు నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి(ఈ ఆర్‌వో) రమ పేర్కొన్నారు.

ఓట్ల తొలగింపు కోసం 317 దరఖాస్తులు
రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తున్న ఈఆర్‌వో రమ

పీలేరు, సెప్టెంబరు 27: పీలేరు నియో జకవర్గం లోని ఓటరు జాబితా నుంచి ఓట్ల తొలగింపు కోసం 317 దరఖాస్తులు అందినట్లు పీలేరు నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి(ఈ ఆర్‌వో) రమ పేర్కొన్నారు. ఫోటో ఓటరు జాబితా స్పెషల్‌ సమరీ రివిజన ప్రక్రియలో భాగం గా శుక్రవారం ఆమె పీలేరు తహసీల్దారు కార్యా లయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధు లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓట్ల తొలగింపు కోసం అం దిన దరఖాస్తులన్నీ చని పోయిన వారివి ఉండడంతో వాటిని క్షుణ్ణంగా పరిశీలించమని సంబంధిత బీఎల్‌వోలకు అందజేసినట్లు తెలిపారు. అదే విధంగా నియోజకవర్గ వ్యాప్తం గా ఈ ఏడాది జనవరి 26వ తేదీ నుంచి శుక్రవారం వరకు కొత్త ఓటర్ల నమోదు, తొల గింపులు, ఫోటో సవరణ, చిరునామాల మార్పులు వంటి 15934 దరఖాస్తులు అందా యని వెల్లడించారు. వాటిలో పీలేరు మండలం నుంచి అత్యధికంగా 5599, కలికిరి నుంచి 2869, కేవీపల్లె నుంచి 2004, వాల్మీకిపురం నుంచి 1887, గుర్రంకొండ నుంచి 1858, కల కడ నుంచి 1717 దరఖాస్తులు అందాయన్నారు. వాటన్నింటినీ బీఎల్‌వోలు, సూపర్‌వైజర్ల ద్వారా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. తమకు అందిన దరఖాస్తుల వివరాలు రాజకీయ పార్టీల ప్రతినిధులకు కూడా అందిస్తామని, అందరూ సమష్టిగా పనిచేసి తప్పులు లేని ఓటరు జాబితా తయారు చేసేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తహసీ ల్దారు భీమేశ్వర రావు, టీడీపీ నాయకులు పురం రామ్మూర్తి, కాంగ్రెస్‌ నాయకులు అమృత తేజ, జనసేన నాయకులు పవన కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 27 , 2024 | 11:40 PM