Share News

అభివృద్ధిలో దూసుకెళ్తున్న కూటమి ప్రభుత్వం

ABN , Publish Date - Sep 25 , 2024 | 12:21 AM

రాష్ట్రాభివృద్ధిలో కూటమి ప్రభుత్వం ముందుకు దూసుకెళ్తోందని ఎమ్మెల్యే షాజహన బాషా పేర్కొన్నారు.

అభివృద్ధిలో దూసుకెళ్తున్న కూటమి ప్రభుత్వం
సమావేశంలో మాట్లాడుత్ను ఎమ్మెల్యే షాజహన బాషా

నిమ్మనపల్లి, సెప్టెంబరు 24: రాష్ట్రాభివృద్ధిలో కూటమి ప్రభుత్వం ముందుకు దూసుకెళ్తోందని ఎమ్మెల్యే షాజహన బాషా పేర్కొన్నారు. మం డలంలోని రెడ్డివారిపల్లి పంచాయతి పిట్టావాండ్లపల్లిలో మంగళవారం జరి గిన మన ప్రభుత్వం..మంచి ప్రభుత్వం లో భాగంగా ఎమ్మెల్యే ప్రజాదర్బార్‌ నిర్వ హించారు. స్థానిక మాజీ ఎంపీటీసీ నాగరాజనాయుడు ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ ఏర్పడి 100రోజులు పూర్తి కావడంతో ఇప్పటికే ఇచ్చిన హమీలలో నాటుగింటిని పూర్తి చేసిన ఘనత సీఎం చంద్రబాబునాయుడుకే దక్కింద న్నారు. ప్రస్తుతం మండలంలో దెబ్బతిన్న గ్రామీణ రోడ్ల కోసం 3.5కోట్లు, సీసీ రోడ్లు కోసం 50లక్ష లు, కస్తూరిబా పాఠశాలకు 3.5లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. అనంతరం ప్రజదర్బార్‌ ప్రజల వద్ద నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. అనంతరం సమావేశానికి వచ్చిన ప్రజలకు మాజీ ఎంపీటీసీ నాగరాజ అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్ర మంలో తహసీల్దార్‌ ధనంజేయులు, ఎంపీడీవో రమేష్‌, టీడీపీ మండల అధ్యక్షుడు వెంకట రమణ నాయకులు ఆర్జే వెంకటేష్‌, రెడ్డెప్పరెడ్డి, సుధాకర్‌రావు, మల్లికార్జున, చంద్రశేఖర్‌, లక్ష్మన్న, చెండ్రాయుడు పాల్గొన్నారు.

కలకడలో:ప్రజాసంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని దిగువపాలెం, బాలయ్యగారిపల్లె పంచా యతీలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్ని కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షోభంలోను రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, అభివృద్దిని కొనసాగించడం సీఎం చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. అనంతరం ప్రజల దర్భార్‌ నిర్వహించి ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. అలాగే టీడీపీ నాయకుడు మెకానిక్‌ ఈశ్వర తండ్రి వెంకటయ్య ఆనారోగ్య విషయం తెలుసుకుని వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన గ్రామాల్లో తాగునీరు, విద్యుత, రెవెన్యూ సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు మల్లారపు రవిప్రకాశ నాయుడు, అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాశ, బీజేపీ నేత మధుసూదనరెడ్డి, నాయకులు బరకం శ్రీనివాసులరెడ్డి, ప్రభాకర్‌నాయుడు, తిరుపతినాయుడు, కోటరమణ నాయుడు, కాంతారావు, బివిస్వామి, విశ్వనాథ్‌, చంద్రమోహన, పీవీరమణనాయుడు, త్యాగరాజు, అధికారులు పాల్గొన్నారు.

పెద్దమండ్యంలో: ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తంబళ్లపల్లి నియోజక వర్గ టీడీపీ ఇనచార్జి దాసరి పల్లి జయచంద్రారెడ్డి, జనసేనపార్టీ నేత పోతుల సాయి నాథ్‌ పేర్కొన్నారు. పెద్దమండ్యంలో మంగళవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో వారు మాట్లాడుతూ పవిత్ర పుణ్యక్షేత్రం తిరు మల వేంటేశ్వరస్వామీ వారి లడ్డూ ప్రసాదా నికి కల్లీ నెయ్యిని సరఫరా చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ముందుగా వెలుగు ఏపీఎంలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో కూటమి నేతలు కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. తహసీల్దార్‌ సయ్యద్‌ ఆహ్మద్‌, ఎంపీడీవో శ్రీధర్‌రావు, తంబళ్లపల్లి సమస్వయకర్త సీడ్‌మల్లికార్జున, తులసీధర్‌నాయుడు, ప్రసాద్‌రెడ్డి, శంకరరెడ్డి, టీడీపీ నేతలు విశ్వనాధరెడ్డి, సిద్దవరం ప్రసా ద్‌, బీజేపీ మండల అధ్యక్షుడు లక్షీనారాయణ, ఎంపీటీసీ రుక్మాంగధరెడ్డి, యుగంధర్‌రెడ్డి పాల్గొన్నారు.

తంబళ్లపల్లెలో: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని ఎంపీడీవో సురేంద్ర నాథ్‌ అన్నారు. మంగళవారం ఎంపీడీవో ఎర్రసానిపల్లె, ఎద్దులవారిపల్లెలో సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులతో కలసి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొ న్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం వంద రోజుల్లో చేసిన పనులు, అమలు చేసిన పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కూటమి నేతలు టైల్స్‌ మల్లి, దేవరాశి, సుధాకర్‌, నారాయణ, నరసింహులు పాల్గొన్నారు.

వాల్మీకిపురంలో: మండలం వ్యాప్తంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం చేపట్టి ఇం టింటా టీడీపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై కరపత్రాలు పంపిణీ చేశారు. వాల్మీకిపురం మండల టీడీపీ అధ్యక్షులు మల్లికార్జునరెడ్డి, నాయకులు పీవీ నారా యణ, చంద్రమౌళి, కోసూరి రమేష్‌, వల్లిగట్ల రమణ, మురళి, రాజేంద్రాచారి పాల్గొన్నారు.

కురబలకోటలో: పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందివ్వడమే సీఎం చంద్రబాబు ధ్యేయమని తంబళ్లపల్లె నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు శ్రీనాథ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని మట్లివారిపల్లె గ్రామ సచివాలయంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అన్ని రంగాలు అభివృద్ధి వైపు పయనిస్తున్నాయన్నారు.

Updated Date - Sep 25 , 2024 | 12:21 AM