కలెక్టరేట్‌లో స్టాఫ్‌నర్సు ఆత్మహత్యాయత్నం
ABN , Publish Date - Sep 09 , 2024 | 11:50 PM
చిన్నమ్మ అనే మహిళ 14 సంవత్సరాలుగా స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నారు. ఏడాది పాటు కడప రిమ్స్‌లో సైతం పనిచేశారు. ఈమెకు డాక్టర్ చిన్నిక్రిష్ణ మాయమాటలు చెప్పి వివాహం చేసుకుని కాపురం చేసి కొంతకాలం తర్వాత పట్టించుకోవడం మానేశాడు.
ఫిర్యాదు చేసినా పోలీసులు న్యాయం చేయలేదని ఆవేదన
కడప (ఎడ్యుకేషన), సెప్టెంబరు 9 : న్యాయం కోసం కలెక్టరేట్ ఆవరణలో స్టాఫ్ నర్సు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తనకు వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలని విష ద్రావణం తాగారు. పోలీసులు ఆమెను హుటాహుటిన రిమ్స్‌కు తరలించారు. బాధితురాలు తెలిపిన మేరకు..
చిన్నమ్మ అనే మహిళ 14 సంవత్సరాలుగా స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నారు. ఏడాది పాటు కడప రిమ్స్‌లో సైతం పనిచేశారు. ఈమెకు డాక్టర్ చిన్నిక్రిష్ణ మాయమాటలు చెప్పి వివాహం చేసుకుని కాపురం చేసి కొంతకాలం తర్వాత పట్టించుకోవడం మానేశాడు. తనకు న్యాయం చేయాలని చిన్నమ్మ పోలీసుస్టేషన్లలో పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. చివరికి డాక్టర్ చిన్నిక్రిష్ణ, డాక్టర్ తేజ్‌దీప్ వర్మ, సుజాత కలిసి ఆమెపై దాడి చేసి గాయపరిచారు. దాడికి పాల్పడిన వారిపై జిల్లా అధికారులు విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ విషయంపై పలుమార్లు చిన్నచౌకు పోలీసులకు తెలిపినా పట్టించుకోక పోవడంతో కలెక్టరేట్‌కు వచ్చి విషద్రావణం తాగానని బాధితురాలు చిన్నమ్మ తెలిపారు. ఇప్పటికైనా కలెక్టరు, ఎస్పీ కలగజేసుకుని తనను మోసం చేసిన డాక్టర్ చిన్నిక్రిష్ణ, అలాగే తనపై దాడికి పాల్పడిన డాక్టర్ తేజ్‌దీప్‌వర్మ, సుజాతలపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. కాగా.. విషద్రావణం తాగుతుండగా పోలీసులు అడ్డుకోవడంతో పాటు ఆమెను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.