ఏసీపీ ఉన్నంత వరకు అడుగుపెట్టను
ABN , Publish Date - Aug 29 , 2024 | 10:50 PM
కాలువ పోరంబోకు, మరుగుదొడ్ల స్థలాలు పరిరక్షించడంలో టౌన్‌ప్లానింగ్ అధి కారులు విఫలమయ్యారని టీడీపీ కౌన్సిలర్ చింతకుంట సరిత ఆరోపిం చారు.
మున్సిపల్ స్థలాల పరిరక్షణలో వైఫల్యాన్ని నిరసిస్తూ కౌన్సిలర్ సరిత బాయ్‌కాట్
నడింపల్లెలో కాల్వను సర్వేచేయించి నివేదిక తెప్పిస్తా : కమిషనర్
ప్రొద్దుటూరు, ఆగస్టు 29: కాలువ పోరంబోకు, మరుగుదొడ్ల స్థలాలు పరిరక్షించడంలో టౌన్‌ప్లానింగ్ అధి కారులు విఫలమయ్యారని టీడీపీ కౌన్సిలర్ చింతకుంట సరిత ఆరోపిం చారు. టౌన్‌ప్లానింగ్ ఏసీపీ మునిర త్నం తీరును నిరసిస్తూ అతను వున్నంత వరకు కౌన్సిల్ సమావేశం లో అడుగుపెట్టనని బాయ్‌కాట్ చేశారు. గురువారం మున్సిపల్ సభా భవనంలో చైర్‌పర్సన్ భీమునిపల్లె లక్ష్మీ దేవి అధ్యక్షతన చేపట్టిన అత్యవసర కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ చింతకుంట సరిత బాయ్‌కాట్‌పై కమిషనర్ రఘునాధరెడ్డి స్పం దిస్తూ కౌన్సిలర్ సరిత ఫిర్యాదు మేరకు నడింపల్లెలో కాలువను సర్వే చేయించి నివే దికను వచ్చే సమావేశానికి తెస్తానని హామీ ఇచ్చారు. అజెండాలోని 2అంశం నుంచి 6 అంశం వరకు ప్రధాన కాలువల పూడిక తీ త పనుల టెండర్లకు ఆమోదం తెలిపారు. పూడిక తీత పనులు ఇంకా మొదలు పెట్టక పోవడంపై మున్సిపల్ వైస్‌చైర్మెన్ బంగారు రెడ్డి అధికారుల తీరును తప్పుబట్టారు. వర్షా లు రాకముందు పూడిక తీస్తారా వర్షాలు వచ్చిపోయాక పనులు చేస్తారా అని ఎద్దేవా చేశారు. కమిషనర్ స్పందిస్తూ పనులు మొ దలు పెట్టామని సమాధానం ఇచ్చారు. తాత్కాలిక కూరగాయల మార్కెట్‌లో కూడా రోడ్ల మీద వ్యాపారులు కూరగాయలు పోసి ప్రజలకు అసౌకర్యం కల్పిస్తున్నారని, వారి బండలు రద్దు చేస్తామని చెప్పి చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్ గరిశపాటి డిమాండ్ చేసింది.
మక్కా మసీదు వద్ద కాలువలో సిల్ట్ తీసే పేర గ్రిల్స్ తొలగించి సిల్ట్ తీయలే దని కౌన్సిలర్ గాజుల శివజ్యోతి ఆరోపించారు. ఇందువల్ల గ్రిల్స్ వూడిపోయాయని పరిశీలించి చర్య లు తీసుకుంటామని కమిషనర్ తెలి పారు. పూడికతీత పనులపై కౌన్సిల ర్లకు ఎక్కడెక్కడ పనులు జరుగుతు న్నాయో చెబితే తాము పరిశీలిస్తా మని కౌన్సిలర్ జిలాన్ అన్నారు. ఎన్ని వీల్ బార్లు పుష్‌కాట్‌లు కొను గోలు చేశారు. వార్డుకు ఎన్ని ఇస్తున్నారో తెల పాలని కోరగా 40 వీల్ బార్లు 40 పుష్‌కా ట్‌లు కొనుగోలు చేశామని వార్డుకు ఒకటి ఇస్తామని ఏఈ బ్యూలా వివరించారు. టీడీ పీ కౌన్సిలర్ వంగనూరు మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ 5వవార్డులో పందులు ఆవుల సమస్యను పరిష్కరించాలని కోరారు. ఇందు కు పందులను ఒకసారి పట్టామని రెండో సారి కూడా పందులు పట్టి తరలిస్తామని అలాగే ఆవులను గోశాలకు తరలిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. అనంతరం 16 అంశాల అజెండాను ఆమోదించారు.