మానసిక ఆరోగ్యంపై అవగాహన
ABN , Publish Date - Oct 09 , 2024 | 12:00 AM
రిమ్స్ ప్రాంగణంలో గల ఇనిస్టిట్యుట్ ఆఫ్ మెంటల్ హెల్త్ కడప వారి ఆధ్వర్యంలో ఈనెల 10న ప్రపంచ మానసిక వారోత్సవాలు నిర్వ హించ నున్నారు.
కడప (సెవెనరోడ్స్), అక్టోబరు 8 : రిమ్స్ ప్రాంగణంలో గల ఇనిస్టిట్యుట్ ఆఫ్ మెంటల్ హెల్త్ కడప వారి ఆధ్వర్యంలో ఈనెల 10న ప్రపంచ మానసిక వారోత్సవాలు నిర్వ హించ నున్నారు. ఈ మేరకు మంగళవారం ఈ అంశంపై ప్రజలకు అవగాహన కోసం ఇనిస్టిట్యుట్ ఆఫ్ మెంటల్ హెల్త్ వారు కడప మున్సిపల్ కార్పొరేషన నుంచి ఎర్రముక్కపల్లె సర్కిల్, మహవీర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. తద్వారా మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. మత్తు పదార్ధాలకు బానిస అయితే శారీరక, మానసిక సమస్యలు ఎదురవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎంహెచ సూపర్ ఐడెంటి డాక్టర్ వెంకటరాముడు, మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ విజయభాస్కర్‌రెడ్డి, వంశీక్రిష్ణ, సునీత, పీజీ మెడిసిన, ఎంబీబీఎస్ విద్యార్థులు, ఎన్జీఓలు విజయ, వాసంతు, ఎనవీకే సుబ్బయ్య పాల్గొన్నారు.