Share News

మహిళా చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

ABN , Publish Date - Oct 19 , 2024 | 11:16 PM

విద్యార్థి దశలోనే బాలికా, మహిళా చట్టాలపై అవగాహన పెం చుకోవాలని జిల్లా 2వ అద నపు జడ్జి బి.అబ్రహాం పేర్కొ న్నారు.

మహిళా చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
గురుకుల పాఠశాలలో స్టోర్‌రూమ్‌ తనిఖీ చేస్తున్న 2వ అదనపు జిల్లా జడ్జి అబ్రహాం

మదనపల్లె టౌన, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): విద్యార్థి దశలోనే బాలికా, మహిళా చట్టాలపై అవగాహన పెం చుకోవాలని జిల్లా 2వ అద నపు జడ్జి బి.అబ్రహాం పేర్కొ న్నారు. శనివారం స్థానిక ప్ర భుత్వ బాలికల గురుకుల పాఠశాలను జడ్జి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలోని డార్మెంటరి, డైనింగ్‌ హాల్‌, వంట గది, స్టోర్‌ రూమ్‌ను జడ్జి పరిశీలించి అక్క డ విద్యార్థినులకు ఏవైనా అసౌకర్యాలు ఉంటే తెలపాలని సూచించారు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన విద్యార్థినుల తల్లిదండ్రులను విచారించారు. ఈ పాఠశాల ఎగువున ఉన్న గుట్టలపై నుంచి వర్షపు నీరంతా పాఠశాల ప్రహరీ కింద ప్రవహిస్తూ, పాఠశాల ఆవరణలో కాలువలు ఏర్పడి ఇబ్బంది గా ఉందని అధ్యాపకులు జడ్జి దృష్టికి తీసుకొచ్చారు. ప్రిన్సిపాల్‌ వసుంధర, వైస్‌ ప్రిన్సిపాల్‌ శ్రీలత, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

Updated Date - Oct 19 , 2024 | 11:16 PM