కులమతబేధాలు సమసిపోవాలి: జేవీవీ
ABN , Publish Date - Sep 28 , 2024 | 11:30 PM
కులమత బేధాలు సమసిపోవాలని జేవీవీ జిల్లా అధ్యక్షుడు సమీర్బాషా పిలుపునిచ్చారు.
కడప (ఎడ్యుకేషన), సెప్టెంబరు 28 : కులమత బేధాలు సమసిపోవాలని జేవీవీ జిల్లా అధ్యక్షుడు సమీర్బాషా పిలుపునిచ్చారు. కడప నగరం గాంధీనగర్ మున్సిపల్ హైస్కూలులో జేవీవీ, సాహితీస్రవంతి సంయుక్త ఆధ్వర్యంలో గుర్రం జాషువా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పుష్పకుమారితో పాటు ఆయన మాట్లాడుతూ గుర్రంజాషువాను స్మరించుకోవడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక సభ్యురాలు సునీత, నాయకులు వెంకటేశ్వర్లు, అరుణ, ఆరోగ్యమేరీ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.