క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి : ఎస్‌ఐ
ABN , Publish Date - Sep 13 , 2024 | 11:08 PM
విద్యార్థులు క్రమశిక్షణతోనే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని సింహాద్రిపురం ఎస్‌ఐ తులసీ నాగప్రసాద్ సూచించారు.
సింహాద్రిపురం, సెప్టెంబరు 13: విద్యార్థులు క్రమశిక్షణతోనే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని సింహాద్రిపురం ఎస్‌ఐ తులసీ నాగప్రసాద్ సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని కోవరంగుట్టపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రస్తుత ఆధునిక టెక్నాలజీ వినియోగంపై సమాజంలో బాలబాలికలు ఎలా మెలగాలి అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్‌ఐ విద్యార్థులకు సూచనలు ఇస్తూ ఆధునిక టెక్నాలజీని ప్రతి విద్యార్థి మంచి పనికి వినియోగం చేసుకోవాలన్నారు. ఆనలైన గేమ్స్ జోలికి వెళ్లి ఇబ్బందుల పాలు కావద్దన్నారు. సెల్ ను అనవసర విషయాలకు అధిక సమయం వినియోగంచవద్దన్నారు. అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. విద్యార్థులు ఈవిటీజింగ్ జోలికి వెళ్లవద్దన్నారు. విద్యార్థినుల పట్ల ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్‌ఐ హెచ్చరించారు. విద్యార్థినులకు ఇబ్బంది కలిగితే 100కు ఫోన చేసి పోలీసుల సాయం పొందవచ్చన్నారు. కార్యక్రమంలో హెచఎం రవణమ్మ, సిబ్బంది పాల్గొన్నారు.