Share News

డీకేటీ భూముల రిజిస్ర్టేన్లపై కలెక్టర్‌ కొరడా

ABN , Publish Date - Oct 10 , 2024 | 12:17 AM

జిల్లాలో ప్రభుత్వ భూముల అడ్డగోలు రిజిసే్ట్రషన్లపై కలెక్టర్‌ శివశంకర్‌ కొరడా ఝుళిపించారు. ఈ మేరకు బుధవారం జమ్మలమడుగు డివిజన పరిధిలో 57 రిజిసే్ట్రషన్లను రద్దు చేసి అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. ఇటీవల ఫ్రీహోల్డ్‌ భూముల వ్యవహారంలో

డీకేటీ భూముల రిజిస్ర్టేన్లపై కలెక్టర్‌ కొరడా

నిబంధనలకు విరుద్ధంగా జరిగిన 57 రిజిస్ర్టేషన్లు రద్దు

జిల్లాలో 76,275 ఎకరాల ఫ్రీహోల్డ్‌ భూములపై ఆరా?

రెవెన్యూ, రిజిస్ర్టేషన్ల శాఖల ఉద్యోగుల్లో కలవరం

కడప(కలెక్టరేట్‌), అక్టోబరు 9: జిల్లాలో ప్రభుత్వ భూముల అడ్డగోలు రిజిసే్ట్రషన్లపై కలెక్టర్‌ శివశంకర్‌ కొరడా ఝుళిపించారు. ఈ మేరకు బుధవారం జమ్మలమడుగు డివిజన పరిధిలో 57 రిజిసే్ట్రషన్లను రద్దు చేసి అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. ఇటీవల ఫ్రీహోల్డ్‌ భూముల వ్యవహారంలో మైదుకూరు తహశీల్దారు కార్యాలయం పరిధిలో దాదాపు 500 ఎకరాలకు పైగా నిబంధనలకు విరుద్ధంగా అన్యాక్రాంతం చేశారనే నిర్ధారణకు వచ్చి అప్పటి తహశీల్దారు అనురాధ సహా మరో 10 మంది గ్రామ రెవెన్యూ అధికారులకు కలెక్టర్‌ నోటీసులు జారీ చేశారు. కలెక్టర్‌ తీసుకుంటున్న చర్యలతో ఇటు రెవెన్యూ అటు రిజిసే్ట్రషన శాఖల అధికారులు, సిబ్బందికి గొంతులో వెలక్కాయ పడ్డట్లైంది. ఇన్నాళ్లు జగన సర్కారులో చేసిన తప్పిదాలు బయట పడితే సస్పెన్షన్లు తప్పవంటూ ఆందోళన చెందుతున్నారు.

దువ్వూరు కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌ జి.మృణాళినిదేవి ముద్దనూరు ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ర్టార్‌గా ఉన్న సమయంలో ప్రభుత్వ భూములపై 57 రిజిస్ర్టేషన్లు చేసినట్లు తాజాగా జిల్లా రిజిస్ర్టార్‌ పీఎనవీ బాబు బృందం చేసిన విచారణలో బట్టబయలైంది. ఈ మేరకు సమగ్ర విచారణ నివేదికను కలెక్టర్‌కు జిల్లా రిజిస్ర్టార్‌ అందజేశారు. సదరు నివేదికను పరిశీలించిన కలెక్టర్‌.. ముద్దనూరు మండలంలో 53, జమ్మలమడుగులో ఒక్కటి, ఎర్రగుంట్ల మండలంలో మూడు వెరసి మొత్తం 57 రిజిస్ర్టేషన్లు నిబంధనలకు విరుద్ధంగా జరిగినట్లు నిర్ధారించారు. 26కే ఏపీ రిజిసే్ట్రషన యాక్టు 1908 ప్రకారం 57 రిజిసే్ట్రషన్లు తక్షణమే రద్దు చేస్తూ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

596 జీవో పేరుతో...

జగన పాలనలో పేదల భూములు అడ్డగోలుగా పెద్దలు బొక్కేశారని అపవాదు ఉంది. అధికారం చేతిలో ఉంది కదా అని, పేదల జీవనానికి ఇచ్చిన డీకేటీ భూములను ఆ పార్టీ నేతలు వదల్లేదు. రెవెన్యూ, రిజిసే్ట్రషన్ల అధికారులను ప్రలోభపెట్టి ఇష్టారాజ్యంగా జిల్లాలో పేదల, ప్రభుత్వ భూములను రిజిసే్ట్రషన్లు చేసుకున్నారు. దర్జాగా బ్యాంకు రుణాలు పొందిన వారు కొందరైతే, పట్టణ ప్రాంతాలకు సమీప భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ దందాలను నడిపిస్తూ పేదల నోట్లో దుమ్ముకొట్టిన వారు మరికొందరు. ఇలాంటి భూముల వ్యవహారంలో తమకు న్యాయం చేయాలంటూ కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెెల్లువెత్తాయి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జగన సర్కారు తెచ్చిన విధానాల్లోని లోపాలను వెలికితీసే చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఇటీవల మైదుకూరు మండలంలో ఫ్రీహోల్డ్‌ భూముల వ్యవహారం బయట పడడంతో జగన హయాంలో జిల్లాలో పని చేసిన తహశీల్దార్లు, సిబ్బందికి ముచ్చెమటలు పడుతున్నాయి. జగన సర్కారు వ్యూహాత్మకంగా తెచ్చిన 596 జీవో ద్వారా పేదలకు అమ్ముకునేహక్కు కల్పిస్తున్నామంటూ పెద్దలు కొట్టేసే ప్రయత్నం చేశారనే ఆరోపణలు వచ్చాయి. మరో 3 నెలలకు జీఓ వస్తోందనగానే ప్రజా ప్రతినిధులకు, రెవెన్యూ శాఖలకు గుట్టుగా సమాచారం చేరడంతో వ్యూహాత్మకంగా పేదల భూములకు పదోపరకో ఆశ చూపి జిల్లాలో అడ్డగోలుగా దోచుకున్నారు. ఇది మన జిల్లాకే పరిమితం కాలేదు. అన్యాయం జరిగిందంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వానికి పేదల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు అధికారంలోకి రాగానే ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ర్టేషన్లు, అన్యాక్రాంతంపై గురిపెట్టారు. వెంటనే జగన సర్కారులో జరిగిన అక్రమాలను వెలుగులోకి తెచ్చి పేదలకు న్యాయం చేసే దిశగా చర్యలు చేపట్టారు.


తాత్కాలికంగా నిలుపుదల

జిల్లా వ్యాప్తంగా 76,275 భూములకు ఫ్రీహోల్డ్‌ కల్పిస్తూ రెవెన్యూశాఖలో జీ హుజూరు అనే అధికారుల అవినీతి, అక్రమాలు త్వరలో వెలుగులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. జిల్లా వ్యాపప్తంగా 36 మండలాల్లో సగటున 2-3 వేల ప్రభుత్వ భూములకు ఫ్రీహోల్డ్‌ కల్పించేందుకు రెవెన్యూ శాఖ జాబితా మండలాల వారీగా సిద్ధం చేసింది. జమ్మలమడుగు మండలంలో 25,907 ఎకరాలు, బద్వేలులో 15,888 ఎకరాలు, కడపలో 10,755 ఎకరాలు, పులివెందుల డివిజనల్‌ 23,724 ఎకరాల ఫ్రీహోల్డ్‌ భూములున్నాయి. ఈ భూముల అవకతవకలపై చంద్రబాబు ప్రభుత్వం మరో 3నెలలపాటు అనుమతులు తాత్కాలికంగా నిలుపుదల చేసి విచారణకు దిగింది. ఇప్పటికే జిల్లాలో మైదుకూరు మండలంలో అవకతవకలు జరగడం, ఇదే తరహాలో మిగతా మండలాల్లో ఫ్రీహోల్డ్‌ భూముల అక్రమాలు గుట్టురట్టయితే రెవెన్యూ, రిజిసే్ట్రషన్ల శాఖల అధికారులకు పెద్ద ఎత్తున వేటు పడడం ఖాయమంటున్నారు.

Updated Date - Oct 10 , 2024 | 12:17 AM