Share News

డ్రైనేజీకి అనుగుణంగా హోమియోపతి కళాశాల రోడ్డు నిర్మాణం

ABN , Publish Date - Oct 19 , 2024 | 11:31 PM

డ్రైనేజీ వ్యవస్థకు అనుగుణంగా హోమియోపతి కళాశాల రోడ్డు నిర్మాణం చేపడతామని కమిషనర్‌ ఎన.మనోజ్‌రెడ్డి అన్నారు.

డ్రైనేజీకి అనుగుణంగా హోమియోపతి కళాశాల రోడ్డు నిర్మాణం
ఇంజనీరింగ్‌ అధికారులతో మాట్లాడుతున్న కమిషనర్‌ మనోజ్‌రెడ్డి

నీటి నిల్వలు తొలగించండి...కమిషనర్‌

కడప ఎడ్యుకేషన, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): డ్రైనేజీ వ్యవస్థకు అనుగుణంగా హోమియోపతి కళాశాల రోడ్డు నిర్మాణం చేపడతామని కమిషనర్‌ ఎన.మనోజ్‌రెడ్డి అన్నారు. రోడ్డుపై నిలిచిన నీటిని త్వరితగతిన తొలగించాలని ఇంజనీరింగ్‌ అధికారులకు సూచించారు. ఆంధ్రజ్యోతిలో శనివారం ప్రచురితమైన కథనానికి కమిషనరు స్పందించి కడప నగరం రామాంజనేయనగర్‌, సనసిటి, ఎఎ్‌సఆర్‌ నగర్‌, ఆచారికాలనీ, ఎస్‌బీఐ కాలనీ ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం హోమియోపతి కళాశాల రోడ్డుపై ఉన్న నీటి నిల్వలకు కారణాలను ఇంజనీరింగ్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమస్య పరిష్కారానికి రోడ్డు పునర్‌ నిర్మాణం చేయాల్సి ఉంటుందని, దానికి కావాలసిన అంచనాలను త్వరితగతిన తయారు చేయాలని సూచించారు. అలాగే రోడ్డుపై నిలచిన నీటిని మోటార్లతో తొలగించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాల న్నారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ చెన్నకేశవరెడ్డి, ఈఈలు ఏఈలు, శానిటేషన విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 19 , 2024 | 11:32 PM