ఉపాధితో కలిసొచ్చేనా..?
ABN , Publish Date - Oct 17 , 2024 | 11:37 PM
ములకలచెరువు మండలంలోని పలు రోడ్లపై ప్రయాణం చేయాలంటే సాహసం చేయాల్సి వస్తోంది.
రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పల్లెపండుగలో భాగంగా ఉపా ధి హామీ పథకం కింద గ్రామీణ రోడ్ల అభివృద్ధికి చర్యలు చేప ట్టింది. ఈ పథకాన్ని అన్ని మండలాల్లో అమలు చేస్తే చాలా చోట్ల అధ్వాన్నస్థితిలో ఉన్న రోడ్లు బాగుపడుతాయని ఆయా గ్రామాల ప్రజలు ఆశిస్తున్నారు. ఆమేరకు పల్లెవాసుల ఆశలు నెరవేరుతాయని ఆశిద్దాం.
ప్రయాణం....సాహసమే...!
దుస్ధితికి చేరిన రోడ్లు..వర్షంతో రాకపోకలకు ఇబ్బందులు
గత వైసీపీ హయాంలో గంపెడు మట్టి వేయని వైనం
అధ్వాన్నస్థితిలో పెద్దమండ్యంలోని
శివపురం-తంబళ్లపల్లె రోడ్డు
ములకలచెరువు, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): ములకలచెరువు మండలంలోని పలు రోడ్లపై ప్రయాణం చేయాలంటే సాహసం చేయాల్సి వస్తోంది. తుఫాను కారణంగా గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి రోడ్ల పరిస్ధితి మరీ అధ్వాన్నంగా తయారైంది. రోడ్లపై ఏర్పడ్డ గుంతల్లో వర్షపు నీరు చేరడంతో రాకపోకలు సాగించడానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ములకలచెరువు నుంచి నియోజకవర్గ కేంద్రమైన తంబళ్లపల్లెకు వెళ్లే రోడ్డు మరీ ఆధ్నాన్నంగా మారింది. అలాగే చౌడసమద్రం - కాలువపల్లె, గూడుపల్లె క్రాస్ - కాలువపల్లె, వేపూరికోట క్రాస్ - దేవళచెరువు తదితర రోడ్లు దుస్ధితికి చేరాయి. గత వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో కనీసం రోడ్లకు మరమ్మతులు చేపట్టక పోవడంతో ఈ పరిస్ధితి నెలకొంది. గుంతలకు గంపెడు మట్టి కూడా వేయించిన పాపాన పోలేదు. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రస్తుతం వాహనదారులకు చుక్కల కన్పిస్తున్నాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వమైనా చొరవ తీసుకుని రోడ్డుకు మర మ్మతులు చేయించాలని వాహనదారులు కోరుతున్నారు.
అధ్వాన్నస్థితిలో శివపురం-తంబళ్లపల్లె రోడ్డు
పెద్దమండ్యం, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి) పెద్దమండ్యం మండలం శివపురం-తంబళ్లపల్లి తారురోడ్డు అభివృద్ధి పనులు చేస్తే తం బళ్లపల్లి మల్లయ్యకొండ పర్యాటకం మరింత అభివృద్ధి సాధించి అన్నమయ్య జిల్లా రాయచోటికి రాజమార్గంగా మారుతుంది. శివ పురం- తంబళ్లపల్లి రోడ్డు అభివృద్ధి పనులు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు. అన్నమయ్య జిల్లా ఏర్పాటుతో రాయచోటి వెళ్లడానికి పడమటి మండలాలకు తంబళ్లపల్లి మార్గం కేంద్ర బిందువుగా మారింది. దీంతో వాహనాలలో రాయచోటికి వెళ్లడా నికి అనువైన రోడ్డు మార్గం కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు చూస్తున్నారు. తంబళ్లపల్లి కొండపై వెలసి ప్రసిద్ది చెందిన భ్రమ రాంభికమల్లికార్జున స్వామి దర్శనంతో పాటు, మహాశివరాత్రి వేళ ల్లో ప్రత్యేక పూజల కోసం కాలినడకన శివపురం నుంచి నేలమ ల్లయ్య మార్గంలో కొండకు దిగువ తూర్పు భాగంలో వెలసిన నేల మల్లయ్య స్వామిని దర్శనం చేసుకొని తంబళ్లపల్లి మల్లయ్యకొండ పైకి భక్తులు వెళ్తారు. శివపురం- తంబళ్లపల్లి ఈ మార్గం అభి వృద్ధి చెందితే శివపురం నుంచి నేలమల్లయ్య స్వామి దక్షిణ భాగం నుంచి కేవలం 12 కిలో మీటర్ల దూరంలో తంబళ్లపల్లికి చేరుకుంటారని ఈ ప్రాంత ప్రజలు అధికారులు, ప్రజాప్రతినిధు ల దృష్టికి తీసుకెళ్లారు. దక్షిణ కాశీగా పేరు పొందిన తంబళ్లపల్లి మల్లయ్యకొండను పర్యటక కేంద్రం తీర్యిదిద్దాలని గత అధికారు లు, ప్రజాప్రతితినిధులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు సమా చారం. అటు అన్నమయ్య జిల్లా కేంద్రంకు, ఇటు తంబళ్లపల్లి పర్యాటక కేంద్రంకు అనుకూలంగా శివపురం మార్గం మరింత అభివృద్ధి సాధిస్తుందంటున్నారు. పెద్దమండ్యం, గుర్రంకొండ, గాలి వీడు, చిన్నమండ్యం ప్రజలు తంబళ్లపల్లికి వెళ్లాలంటే ఈ మార్గం అనువుగా ఉంటుంది. కాగా తంబళపల్లి నియోజకవర్గంలోని తం బళ్లపల్లి, బి.కొత్తకోట, పీటీఎం, ములకలచెరువు ప్రజలు రాయచో టికి వెళ్లాంటే తంబళ్లపల్లి వయా పెద్దమండ్యం, చిన్నమండ్యం మార్గం మీదుగా రాయచోటికి పలు ఇక్కట్లతో వెళ్లాల్సి ఉంది. సంబఽంధితాధికారులు రూ. 11 కోట్లతో శివపురం-తంబళ్లపల్లి 12 కిలోమీటర్ల మార్గం అభివృద్ధికి ప్రతిపాదన చేసినా అటవీ మా ర్గంలో 4. 5 కిలో మీటర్ల దూరం ఉండడంతో ప్రతిపాదన రూపుదాల్చలేదని పలువురు వాపోతున్నారు. ఈ మార్గం అభివృద్ధి చెందితే ప్రజలకు అన్ని విధాల సౌకర్యంగా ఉంటుం దని శివపురం సర్పంచ గంగులమ్మ తెలిపారు.