ఉపాధి నిధులు గోల్‌మాల్!
ABN , Publish Date - Sep 27 , 2024 | 11:37 PM
జాతీయ గ్రామీణా ఉపాధిహామీ పథ కం అక్రమాలకు పెద్దతిప్పసముద్రం అడ్డాగా మారింది.
చేసిన పనులనే మళ్లీ చేసి బిల్లులు పెట్టుకున్న వైనం లెక్కలు తేల్చేదెప్పుడో..? అవినీతి జరిగినట్లు తేలితే చర్యలు : ఎంపీడీవో
పెద్దతిప్పసముద్రం సెప్టెంబర్ 27: జాతీయ గ్రామీణా ఉపాధిహామీ పథ కం అక్రమాలకు పెద్దతిప్పసముద్రం అడ్డాగా మారింది. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ఉపాధి అధికారుల సహకారంతో వైసీపీ నాయకుల అండదండలతో చేసిన పనులనే మళ్లీ చేసి బిల్లులను కాజేశారు. మండ లంలో మొత్తం 20 గ్రామ పంచాయతీలు ఉండగా గత ఐదేళ్లలో ఎన్ని కోట్లు దోచేశారో లెక్క తేల్చితే విషయాలు వెల్లడవుతాయి. కొందరు పీల్డ్ అసిస్టెంట్లు తమ గ్రామంలో రోజుకు 250 మంది ఉపాధి హామీ కూలీకి వెళితే స్థానికంగా అక్కడ మేట్ల సహకారంతో అదనంగా కూలీలు పని చేసినట్లు బిల్లులు నొక్కేసినట్లు ఆరోప ణలున్నాయి. పెద్దతిప్పసముద్రం మండలంలో కమ్మచెరువు, కాట్నగల్లు, పట్టెంవాండ్లపల్లె బూర్లపల్లె, బూచి పల్లె, సంపతికోట, నవాబుకోట, మడుమూరు, దేవప్పకోట, పులికల్లు, టి.సదుం, రాపూరివాండ్లపల్లె, తదితర గ్రామాల్లో చేపట్టిన ఉపాధిహామీ పనుల్లో బారీగా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. రాపూరివాం డ్లపల్లె, మడుమూరు, దేవప్పకోట, కాట్నగల్లు, పట్టెంవాండ్లపల్లె అసలైన కూలీలు పనులకు వెళ్లకపోయినా ఇష్టానుసారంగా మస్టర్లలో పేర్లు రాసి లక్షల రూపాయలు దండుకున్నారన్న విమర్శలున్నాయి. మండలంలో జాబ్ కార్డులు 7,799 ఉండగా, కూలీలు 14034 మంది ఉన్నారు. మొత్తం పని చేసిన కూలీలు 2,05,559 మంది. ప్రస్తుతం యాక్టివ్ జాబ్ కార్డు లు 6,214 ఉండగా ఇందులో 10,636 మంది పని చేశారు. పని చేసిన కుటుంబాలు 4493, ప్రభుత్వం రూ.5.34 కోట్లతో వివిధ గ్రామాల్లో రోడ్లు, సచివాలయాలు, సీసీ రోడ్లు, డ్రైనేజి పనుల కోసం ఉపాధి హామీ పథకం ద్వారా రూ.3.38 కోట్లను ఖర్చు చేశారు. 2023-24 గృహనిర్మాణలకు 407 ఉపాధి హామీ ద్వారా రూ.87.15 లక్షలు బిల్లులను పెట్టారు. ఇక 100రో జులు పని పూర్తి అయినవి 574 జాబ్‌కార్డులు, ప్రస్తుతం 1163 మంది మాత్రమే పని చేస్తున్నారు. మండలంలో 67 పారంపండ్‌లకు సంబందిం చి రూ. 7.19 లక్షలు, 111 బోండ్రి ట్రంచలకురూ.41.26 లక్షలు, 179 మం ది రైతులు 470 ఎకరాల్లో పండ్లతోటలకు గాను రూ.114.79 లక్షలు, 26 కాలు వల్లో పూడిక తీత పనులకు రూ.23.57 లక్షలు ఉపాధి పథకం ద్వారా వెచ్చించారు. ఇక మండలంలో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఉపాధిహామీ పనుల్లో జరిగిన అవినీతిని క్షేత్రస్థాయిలో విచారణ జరిపి బయట పెట్టాలని స్థానికులు, కూటమి నేతలు కోరుతున్నారు.
చేసిన పనులకే బిల్లులు పెట్టుకున్నారు
గత వైసీపీ ప్రభుత్వంలో ఆపార్టీ నాయకులు ఉపాధి ిపీల్డ్ అసిస్టెంట్ల ను, టెక్నికల్ అసిస్టెంట్లను బెదిరించి గతంలో పని చేసిన పనులకే తిరిగి బిల్లులు పెట్టుకుని అనేక గ్రామాల్లో నిధులను పక్కదోవ పట్టించారు. కొన్ని గ్రామాల్లో పీల్డ్ అసిస్టెంట్లు మేట్లు గ్రామాల్లో లేని కూలీల పేరుతో మస్టర్లను సృష్టించి బిల్లులను కాజేశారు. క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి అట్టి వారిపై చర్యలు తీసుకోవాలి.
-బక్కన వెంకటప్ప, ఉపాధి కూలీ, చలిమామిడివారిపల్లె
ఉపాధిలో అవినీతి రుజువైతే చర్యలు తప్పవు
మండలంలోని గ్రామాల్లో ఉపాధిహామీ పనుల్లో అక్కడక్కడ గత ప్రభు త్వంలో ఉన్న నాయకులు సిబ్బందితో కలిసి కొన్ని చోట్ల బిల్లులు పెట్టు కున్నారని నా దృష్టికి వచ్చింది అటువంటి వాటిపై క్షేత్ర స్థాయిలో పూర్తిగా విచారణ చేపట్టి ఏమైనా అవినీతి జరిగింటే అటువంటి వారి పై చర్యలు తీసుకుని మొత్తం రికవరీ చేపడతాం, ఇం దులో విచారణ చేపట్టి ఎంతటి వారైనా చర్యలు తీసుకుం టాం. ఎవరినీ వదిలేదిలేదు.
-కేఎన బాలాజీ, ఎంపీడీవో, పెద్దతిప్పసముద్రం