Share News

ఇంజనీర్లు విశ్వేశ్వరయ్యను స్ఫూర్తిగా తీసుకోవాలి

ABN , Publish Date - Sep 15 , 2024 | 11:51 PM

ప్రతి ఇంజనీరు అంకితభావంతో పనిచేస్తూ భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్యను స్ఫూర్తిగా తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధనరెడ్డి పేర్కొన్నారు.

ఇంజనీర్లు విశ్వేశ్వరయ్యను స్ఫూర్తిగా తీసుకోవాలి
పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ రామచంద్రారెడ్డిని సన్మానిస్తున్న గోవర్ధనరెడ్డి

టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధనరెడ్డి

కడప (ఎడ్యుకేషన), సెప్టెంబరు 15: ప్రతి ఇంజనీరు అంకితభావంతో పనిచేస్తూ భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్యను స్ఫూర్తిగా తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధనరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఇంజనీర్స్‌ డేను పురస్కరించుకుని కడప ఆఫీసర్స్‌ క్లబ్‌లో ఇంజనీర్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వేశ్వరయ్య చిన్నప్పుడే ఎన్నో కష్టాలు అనుభవించారన్నారు. విద్యపట్ల ఆసక్తితో ఇంజనీరు చదివి వివిధ హోదాల్లో పనిచేస్తూ వివిధ ప్రాజెక్టులకు రూపకల్పన చేసి వాటిని త్వరితగతిన పూర్తిచేసిన అపర భగీరధుడన్నారు. ఆయన ప్రతిభ వల్ల దేశం గర్వపడేలా చేశారన్నారు. వివిధ యూనివర్సిటీల ద్వారా ఎనిమిది సార్లు గౌరవ డాక్టరేట్‌ పొందిన మేధావి మోక్షగుండం అన్నారు. ప్రభుత్వం కూడా ఉత్తమ ప్రతిభకనబరిచిన ఇంజనీర్లను గుర్తించి వారిని సత్కరించాలన్నారు. ఇంజనీర్లు ప్రగతి రధ సారధులని, వివిధ నిర్మాణాల్లో నాణ్యత పాటిస్తూ నిర్దేశిత గడువు లోపు తమ పనులు చేసి సమా జానికి మేలు చేసినవారవుతారన్నారు. విద్యుత శాఖ రిటైర్డ్‌ ఇంజనీరు ప్రతాప్‌రెడ్డి, పంచాయతీ రాజ్‌ఎ్‌సఈ రామచంద్రారెడ్డి, క్రిష్ణమూర్తి, కేశవులు, హబీబ్‌ ఇంజనీనర్లను సత్కరించారు. అలాగే క్లబ్‌ సభ్యులు జానమద్ది విజయభాస్కర్‌, లేబాక మధుసూదనరెడ్డి, సుబ్బరామయ్య, సోమిరెడ్డి, శ్రీరామరెడ్డి, నాగిరెడ్డి, తిలక్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రఖ్యాత ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య

కడప (నాగరాజుపేట), సెప్టెంబరు 15: భారతదేశంలో ప్రఖ్యాత ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని విద్యుత శాఖ సూపరింటెండెంట్‌ ఇంజనీరు రమణ అన్నారు. ఆదివారం స్థానిక విద్యుతభవనలో ఇంజనీర్స్‌డే సందర్భంగా ప్రఖ్యాత సివిల్‌ ఇంజనీరు అయిన మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంజనీరింగ్‌ విద్యను పూర్తి చేసుకున్న మొదటిసారిగా ముంబైయ్‌లో ప్రభుత్వ ఉద్యోగిగా చేరారన్నారు. హైదరాబాదును సుందరనగరంగా తీర్చిదిద్దిన ఘనత ఆయనదేనన్నారు. ఏ పని అప్పగించినా ఆ పనిని ఒక తపస్సుగా చేపట్టేవారన్నారు. అనంతరం విశ్వేశ్వరయ్య సర్కిల్‌లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Updated Date - Sep 15 , 2024 | 11:51 PM